Vote For Sure : తెలంగాణ అంతటా 5కె రన్
119 నియోకవర్గాల్లో ర్యాలీ
Vote For Sure : తెలంగాణ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా త్వరలో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే సీఎం కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘంతో పరిశీలకులు చర్చలు జరిపారు. ప్రతి ఒక్కరూ ఓటు వేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
Vote For Sure Viral in Telangana
ఈ మేరకు అవగాహన కల్పించాలని సూచించారు. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కీలకమైన ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలలో ప్రతి ఒక్కరూ పాల్గొనేలా ఓట్ ఫర్ ష్యూర్(Vote For Sure) పేరుతో 5కె రన్ నిర్వహించాలని స్పష్టం చేశారు.
దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సీఈసీ ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున ఆయా జిల్లాలలో 5క రన్ చేపట్టారు. విద్యార్థులు, యువతీ యువకులు, పెద్దలు సైతం పాల్గొన్నారు. ఓటు ఆయుధమని దానిని వాడు కోవాలని పిలుపునిచ్చారు. ప్రతి జిల్లా కేంద్రంలో ఆయా జిల్లాల కలెక్టర్లు జెండా ఊపి ప్రారంభించారు.
వారు సైతం పాల్గొన్నారు. ఓటు వేద్దాం మన బతుకులు మనం మార్చుకుందామంటూ పిలుపునిచ్చారు. రాష్ట్రమంతటా వేలాది మంది పాల్గొన్నారు. జాతీయ జెండాలు ధరించారు. ఓటు వేద్దామని కోరారు.
Also Read : Mohammad Azharuddin : నెట్టింట్లో అజ్జూ భాయ్ హల్ చల్