Jailer Record : ర‌జ‌నీ జైల‌ర్ రికార్డుల మోత

క‌లెక్ష‌న్ల వేట‌లో సునామీ

Jailer Record : త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కు ఎదురే లేదు. త‌న స్టామినా ఏమిటో మ‌రోసారి నిరూపించాడు జైల‌ర్ చిత్రంతో. నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో విడుద‌లైన జైల‌ర్ దుమ్ము రేపుతోంది. క‌లెక్ష‌న్ల వేట కొన‌సాగుతోంది. ఆగ‌స్టు 10న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజైన ఈ చిత్రం కంటిన్యూస్ గా క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తోంది. కాసుల వేట‌లో కొన‌సాగుతోంది.

Jailer Record Breaking Collections

ర‌జ‌నీకాంత్ మ‌రోసారి త‌న మేన‌రిజాన్ని అద్భుతంగా ప్ర‌జెంట్ చేశాడు. ఆయ‌న‌కు తోడుగా అందాల ముద్దుగుమ్మ త‌మ‌న్నా భాటియా, శివ రాజ్ కుమార్, మోహ‌న్ లాల్ , ర‌మ్య కృష్ణ‌, యోగి బాబు న‌టించారు. ఆరంభం నుంచే జైల‌ర్(Jailer) వ‌సూళ్లు దుమ్ము రేపుతున్నాయి. తొలి రోజు నుంచే క‌లెక్ష‌న్ల‌తో రికార్డు సృష్టించింది జైల‌ర్. కేవ‌లం 7 రోజుల్లోనే రూ. 500 కోట్ల క్ల‌బ్ లోకి చేరుకుంది ర‌జ‌నీకాంత్ చిత్రం.

దీంతో స్వ‌యంగా సూప‌ర్ స్టార్ రంగంలోకి దిగాడు. విజ‌యోత్స‌వాన్ని జ‌రుపుకుంటున్నాడు. దేవాల‌యాల‌ను సంద‌ర్శించాడు. ఇక యూపీకి వెళ్లాడు. అక్క‌డ ల‌క్నోలో సీఎం యోగిని క‌లుసుకున్నాడు. ఆయ‌న పాదాల‌కు న‌మ‌స్క‌రించాడు. ప్ర‌స్తుతం దీనిపై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. ర‌జ‌నీ స్టామినా ఏమిటి యోగికి సాగిల‌బ‌డ‌టం ఏమిటంటూ ప్ర‌శ్నిస్తున్నారు.

Also Read : Vote For Sure : తెలంగాణ అంత‌టా 5కె ర‌న్

Leave A Reply

Your Email Id will not be published!