PM Modi Viral : నెట్టింట్లో ప్ర‌ధాని మోదీ వైర‌ల్

ప్ర‌పంచ ఫోటోగ్ర‌ఫీ దినోత్స‌వం

PM Modi Viral : ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఆయ‌న‌కు ప్ర‌కృతి అన్నా, ప్ర‌పంచానికి సంబంధించిన విష‌యాలు, అంశాలు అంటే చ‌చ్చేంత ఇష్టం. త‌ను ఎక్క‌డికి వెళ్లినా భార‌తీయ సంస్కృతి, సంప్ర‌దాయం, నాగ‌రిక‌త‌ను ప్ర‌తిబింబించేలా వ‌స్త్ర‌ధార‌ణ ఉంటుంది. అంతే కాదు ఇక్క‌డ భార‌తీయులు త‌యారు చేసిన వ‌స్తువుల‌ను తీసుకు వెళ‌తారు. ఆయా దేశాల‌కు సంబంధించిన అధ్య‌క్షులు, ప్ర‌ధాన మంత్రులు, చైర్మ‌న్లు, వివిధ పేరు పొందిన కంపెనీల చైర్మ‌న్లు, సీఇవోల‌కు జ్ఞాపిక‌లు అంద‌చేస్తూ వ‌స్తారు.

PM Modi Viral With Dressing

అంతే కాదు ఇత‌ర దేశాల నుండి భార‌త దేశానికి వ‌చ్చే నేత‌లు, ప్ర‌తినిధుల‌కు చిర కాలం గుర్తుండి పోయే బ‌హుమతుల‌ను అంద‌చేస్తారు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ(PM Modi). అంతే కాదు అద్భుత‌మైన ఆతిథ్యం ఇవ్వ‌డంలో కూడా త‌న‌కు త‌నే సాటి. ఎక్క‌డికి వెళ్లినా హిందీ త‌ప్ప ఇంకే భాష మాట్లాడేందుకు ఇష్ట‌ప‌డ‌రు.

కార‌ణం మ‌న భాష ప‌ట్ల మ‌న‌కు గౌర‌వం లేక పోతే ఎలా అని ప్ర‌శ్నిస్తారు. ప్ర‌స్తుతం ప్ర‌పంచంలోనే మోస్ట్ పాపుల‌ర్ , ప‌వ‌ర్ ఫుల్ లీడ‌ర్ గా పేరు పొందారు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ . ఇదిలా ఉండ‌గా క్రీడాకారుల‌ను ప్రోత్స‌హించ‌డంలో ఆయ‌న ముందంజ‌లో ఉంటారు. తాజాగా ప్ర‌పంచ ఫోటో గ్ర‌ఫీ దినోత్స‌వం సంద‌ర్బంగా మోదీ ఫోటో ఒక‌టి నెట్టింట్లో వైర‌ల్ గా మారింది.

Also Read : Jailer Record : ర‌జ‌నీ జైల‌ర్ రికార్డుల మోత

Leave A Reply

Your Email Id will not be published!