VVS Laxman : ఇండియా హెడ్ కోచ్ గా లక్ష్మ‌ణ్

ఆసియా క‌ప్ 2023 టోర్నీకి ఎంపిక

VVS Laxman : బీసీసీఐ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ ఏడాది ఆసియా క్రీడ‌ల్లో పాల్గొనే భార‌త క్రికెట్ జ‌ట్టుకు హెడ్ కోచ్ గా హైద‌రాబాద్ కు చెందిన మాజీ క్రికెట‌ర్ , క్రికెట్ అకాడెమీ చీఫ్ వంగీపురం వెంక‌ట సాయి (వీవీఎస్) ల‌క్ష్మ‌ణ్(VVS Laxman) ను ఎంపిక చేశారు. రాహుల్ ద్ర‌విడ్ ను విశ్రాంతి పేరుతో ప‌క్క‌న పెట్టారు.

VVS Laxman as a Head Coach

ప్ర‌స్తుతం భార‌త జ‌ట్టుకు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ గా వ్య‌వ‌హ‌రిస్తారు. ఇదిలా ఉండ‌గా సెప్టెంబ‌ర్ 23 నుంచి అక్టోబ‌ర్ 8 వ‌ర‌కు చైనా లోని హాంగ్ జౌలో ఆసియా క్రీడ‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ క్రీడ‌ల్లో భార‌త పురుషుల‌, మ‌హిళ‌ల జ‌ట్లు పాల్గొంటాయి.

ఇప్ప‌టికే బీసీసీఐ మెన్, ఉమెన్ జ‌ట్ల‌ను ప్ర‌క‌టించాయి. అక్టోబ‌ర్ 5 నుంచి వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ ప్రారంభం కానుంది. ద్వితీయ శ్రేణి జ‌ట్టుతో పాటు పురుషుల టీమ్ ను ఎంపిక చేశారు. పురుషుల టీమ్ కు రుతురాజ్ స్కిప్ప‌ర్ గా ఉంటే మ‌హిళ‌ల జ‌ట్టుకు హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ స్కిప్ప‌ర్ గా ఉండ‌నున్నారు.

జ‌ట్టు ప‌రంగా చూస్తే గైక్వాడ్ కెప్టెన్ కాగా జైస్వాల్ , త్రిపాఠి, తిల‌క్ వ‌ర్మ , రింకూ సింగ్ , జితేష్ శ‌ర్మ‌, సుంద‌ర్ , షాబాజ్ అహ్మ‌ద్ , ర‌వి బిష్ణోయ్ , అవేష్ ఖాన్ , అర్ష దీప్ సింగ్ , ముఖేష్ కుమార్ , శివ‌మ్ మావి, దూబే, ప్ర‌భ్ సిమ్రాన్ సింగ్ ఉన్నారు.

Also Read : Snapana Tirumanjanam : తిరుమ‌ల‌లో ముగిసిన ప‌విత్రోత్స‌వం

Leave A Reply

Your Email Id will not be published!