Gourav Vallabh : భ‌గ‌వత్ రాహుల్ గాంధీతో క‌లిసి న‌డ‌వండి

ఆర్ఎస్ఎస్ చీఫ్ కు కాంగ్రెస్ సూచ‌న

Gourav Vallabh : ముస్లిం నేత‌లు, మేధావుల‌తో వ‌రుస‌గా క‌లుస్తూ వ‌స్తున్నారు రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్ చీఫ్ మోహ‌న్ భ‌గ‌వ‌త్. ఈ సంద‌ర్భంగా ఎంఐఎం చీఫ్ , హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ నిప్పులు చెరిగారు .

ముస్లిం మేధావులు, మ‌త పెద్ద‌ల‌పై. దేశంలో జ‌రుగుతున్న దాడులు, వాస్త‌వ ప‌రిస్థితులు తెలుసు కోకుండా ఎలా ఆర్ఎస్ఎస్ చీఫ్ ను క‌లుస్తారంటూ ప్ర‌శ్నించారు.

తాజాగా కాంగ్రెస్ పార్టీ సంచ‌ల‌న కామెంట్స్ చేసింది. వ్య‌క్తుల‌ను క‌ల‌వ‌డం వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నం క‌ల‌గ‌ద‌ని పేర్కొంది. కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్‌, వాయ‌నాడు ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) త‌మిళ‌నాడు లోని క‌న్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర‌లో క‌లిసి న‌డిస్తే అస‌లు విష‌యాలు, స‌మ‌స్య‌లు, వివాదాలు ఏమిటో తెలుస్తాయ‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టింది.

కులాలు, మ‌తాలు, ప్రాంతాల పేరుతో మ‌నుషుల మధ్య విభేదాలు సృష్టిస్తూ రాజ‌కీయంగా ప‌బ్బం గ‌డపాల‌ని బీజేపీ, దాని అనుబంధ సంస్థ‌లు ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయంటూ ఆరోపించింది.

ప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేస్తూ బీజేపీయేత‌ర ప్ర‌భుత్వాల‌ను కూల్చి వేస్తూ భార‌త రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్న బీజేపీకి బుద్ది చెప్పాల‌ని సూచించింది.

త‌మ నాయ‌కుడు చేప‌ట్టిన యాత్ర ముగిసేలోపు పాల‌క ప్ర‌భుత్వం సృష్టించిన ద్వేషం, విభేదాలు దేశం నుండి పూర్తిగా తొల‌గి పోతాయ‌న్న న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేశారు ఆ పార్టీ నేత గౌర‌వ్ వ‌ల్ల‌భ్(Gourav Vallabh).

త‌మ యాత్ర ప్ర‌భావం వ‌ల్ల‌నే మోహ‌న్ భ‌గ‌వ‌త్ ముస్లిం పెద్ద‌ల‌ను క‌లిశార‌ని పేర్కొన్నారు. బీజేపీ అధికార ప్ర‌తినిధి టెలివిజ‌న్ చ‌ర్చ‌ల్లో గాడ్సే ముర్దాబాద్ అన్నార‌ని గుర్తు చేశారు.

Also Read : కేర‌ళలో పీఎఫ్ఐ బంద్ ఉద్రిక్తం

Leave A Reply

Your Email Id will not be published!