Warner Marsh : ఆస్ట్రేలియా కు బిగ్ షాక్ తగిలింది. శ్రీలంకతో జరిగే టీ20 సీరీస్ కు ఆస్ట్రేలియా జట్టు తరపున స్టార్ ప్లేయర్ గా ఉన్న డేవిడ్ వార్నర్ దూరమయ్యాడు. అతడితో పాటు ఆసిస్ కోచ్ జస్టిస్ లాంగర్ సైతం పక్కకు తప్పుకు్నాడు.
ఇక టీ20 ప్రపంచ కప్ హరోగా పేరొందిన మిచెల్ మార్ష్ కూడా ఆడడం లేదు.
వచ్చే నెల ఫిబ్రవరి 11 నుంచి సిడ్నీ, కాన్ బెర్రా, మెల్ బోర్న్ లలో శ్రీలంకతో జరిగే ఐదు మ్యాచ్ లకు వీరు దూరమయ్యారు.
ఇదిలా ఉండగా మార్చిలో ఆస్ట్రేలియా మూడు ఫార్మాట్ ల సీరీస్ లో భాగంగా పాకిస్తాన్ లో పాకిస్తాన్ తో ఆడనుంది. ఇప్పటికే ఈ విషయాన్ని ఆసిస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది.
దీంతో పాక్ తో ఆడేందుకు గాను డేవిడ్ వార్నర్ , మిచెల్ మార్ష్ (Warner Marsh )లను దూరం పెట్టినట్లు వెల్లడించారు చీఫ్ సెలెక్టర్ జార్జ్ మెయిలీ.
ఈ ఏడాది చివరలో జరిగే టీ20 వరల్డ్ కప్ కోసం తమ జట్టు సన్నాహక మ్యాచ్ లు ఆడుతుందన్నాడు.
అయితే ప్రధాన ఆటగాళ్లకు కొంత విశ్రాంతి అవసరమని తాము వారిని పక్కన పెట్టినట్లు స్పష్టం చేశాడు.
బిగ్ బాష్ లీగ్ స్టార్ మెక్ డెర్మాట్ , ట్రావిస్ హెడ్ , జై రిచర్డ్ సన్ , మోయిసెస్ హెన్రిక్స్ కూడా తాము ఆడేందుకు సిద్దంగా ఉన్నట్లు ప్రకటించారు.
ఇదిలా ఉండగా ఇంగ్లండ్ తో ఇటీవల జరిగిన యాషెస్ సీరీస్ లో చివరి నాలుగు టెస్టులకు గాయంతో దూరమైన జోష్ హేజిల్ వుడ్ తిరిగి వచ్చాడు.
ఇక కోచ్ జస్టిస్ లాంగర్ గైర్హాజర్ కావడంతో అతడి స్థానంలో మెక్ డొనాల్డ్ ప్రధాన కోచ్ గా వ్యవహరిస్తాడు.
తాజాగా ఆసిస్ క్రికెట్ బోర్డు ప్రకటించిన జట్టు ఇలా ఉంది. ఆరోన్ ఫించ్ కెప్టెన్ గా ఉండగా అగర్, పాట్ కమిన్స్
, హేజిల్ వుడ్ , ట్రావిస్ హెడ్, మోయినిస్, హెన్రిక్స్ , జోష్ ఇంగ్లిస్ , మెక్ డెర్మాట్ , మాక్స్ వెల్ , రిచర్డ్ సన్ , కేన్ , స్టీవ్ స్మిత్ , స్టోనస్లే , ఆడమ్ జంపా ఉన్నారు.
Also Read : వ్యాపారవేత్త బెదిరించాడన్న బ్రెండన్