Rana Kapoor : రూ. 5 వేల కోట్ల స్కాం కేసులో ప్రధాన నిందితుడైన యెస్ బ్యాంక్ సహ వ్యవస్థాపకుడు రాణా కపూర్(Rana Kapoor) సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రియాంక గాంధీ వాద్రా నుండి ఎం.ఎఫ్. హుస్సేన్ పెయింటింగ్ ను కొనుగోలు చేయాల్సిందిగా బలవంతం చేశారంటూ ఆరోపించారు.
అంతే కాదు అమ్మిన సొమ్మును సోనియా గాంధీ వైద్యం కోసం వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించి ప్రియాంక గాంధీ వాద్రా కార్యాలయంలో ఈ తతంగం జరగిందని పేర్కొన్నారు.
ఈ విషయాన్ని రాణా కపూర్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి తెలిపారు. సోనియా గాంధీ న్యూ యార్క్ లోని ప్రత్యేక కోర్టులో ఫెడరల్ యాంటీ మనీ లాండరింగ్ ఏజెన్సీ దాఖలు చేసిన ప్రకారం.
ఎం.ఎఫ్. హుస్సేన్ పెయింటింగ్ ను కొనుగోలు చేసేందుకు నిరాకరిస్తే పద్మ భూషణ్ పొందకుండా అడ్డుకుంటామని అప్పటి పెట్రోలియం మంత్రి మురళీ దేవరా తనకు చెప్పారంటూ ఈడీ ముందు కుండ బద్దలు కొట్టారు రాణా కపూర్(Rana Kapoor).
యెస్ బ్యాంక్, డీహెచ్ఎఫ్ఎల్ స్కాంలో ఈడీ నమోదు చేసిన రెండో ఛార్జిషీట్ లో ఇందుకు సంబంధించిన వాంగ్మూలాలు ఉన్నాయి.
ఈ అమ్మకం ద్వారా వచ్చిన సొమ్మును సోనియా గాంధీ కుటుంబం వైద్య చికిత్స కోసం వినియోగించినట్లు తనకు తెలిసిందని చెప్పారు రాణా కపూర్. ప్రస్తుతం రాణా చేసిన కామెంట్స్ , ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.
ప్రస్తుతం రాణా కపూర్ చేసిన ఈ వ్యాఖ్యలు దేశ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చకు దారితీశాయి.
Also Read : యోగి దెబ్బకు గ్యాంగ్ స్టర్లు లొంగుబాటు