Wasim Jaffer : జస్ప్రీత్ బుమ్రా ధోనీని చూసి నేర్చుకో
సూచించిన మాజీ ప్లేయర్ వసీం జాఫర్
Wasim Jaffer : భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్ వసీం జాఫర్ (Wasim Jaffer) షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇవాళ ఇంగ్లండ్ లోని బర్మింగ్ హోమ్ లో రీ షెడ్యూల్ ఐదో టెస్టు ప్రారంభం కానుంది. రోహిత్ శర్మకు కరోనా రావడంతో చివరి టెస్టుకు దూరమయ్యాడు.
అతడితో పాటు వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ గాయం కారణంగా ఆడడం లేదు. దీంతో బీసీసీఐ సెలెక్షన్ కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. భారత స్టార్ పేసర్ జస్ ప్రీత్ బుమ్రాకు ప్రమోషన్ ఇచ్చింది.
అతడిని ఐదో టెస్టుకు కెప్టెన్ గా , రిషబ్ పంత్ ను వైస్ కెప్టెన్ గా నియమించింది. ఇదిలా ఉండగా సుదీర్ఘ కాలం తర్వాత బుమ్రాకు పగ్గాలు ఇచ్చింది. ఇప్పటి వరకు కపిల్ దేవ్ , అనిల్ కుంబ్లే భారత జట్టుకు కెప్టెన్లుగా ఉన్నారు.
ఆ తర్వాత మరో బౌలర్ కు అప్పగించింది బీసీసీఐ సెలెక్షన్ కమిటీ. ఈ సందర్భంగా వసీం జాఫర్ స్పందించాడు. బుమ్రాకు(Jasprit Bumrah) అభింనదలు తెలిపారు. ఇదే సమయంలో అరుదైన అవకాశాన్ని వినియోగించు కోవాలని సూచించాడు.
గతంలో భారత జట్టుకు నాయకత్వం వహించిన కెప్టన్లు సాధించిన విజయాలను గుర్తుకు తెచ్చు కోవాలని పేర్కొన్నాడు.
ఇదే సమయంలో భారత జట్టుకు ప్రపంచ వ్యాప్తంగా పేరు తీసుకు వచ్చేలా చేసిన జార్ఖండ్ డైనమెట్ మహేంద్ర సింగ్ ధోనీని ఆదర్శంగా తీసుకోవాలని జస్ ప్రీత్ బుమ్రాకు హితవు చెప్పాడు వసీం జాఫర్.
మరో వైపు బెన్ స్టోక్స్ సారథ్యంలోని ఇంగ్లండ్ జట్టు మంచి ఊపు మీదుంది. స్వదేశంలో న్యూజిలాండ్ తో జరిగిన టెస్టు సీరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది.
Also Read : వన్డే..టి20 జట్లకు రోహిత్ శర్మ కెప్టెన్