Wasim Jaffer : అసలైన టైంలో సూర్య చేతులెత్తేశాడు
రోహిత్ శర్మపై వసీం జాఫర్ కామెంట్స్
Wasim Jaffer : ఆస్ట్రేలియా వేదికగా ఐసీసీ టి20 వరల్డ్ కప్ ముగిసినా ఇంగ్లండ్ కొట్టిన దెబ్బకు భారత అభిమానులే కాదు మాజీ క్రికెటర్లు కూడా జీర్ణించు కోలేక పోతున్నారు. ప్రధానంగా బాగా ఆడక పోయినా సరే టీమిండియాను అన్ని వేళల్లో వెనకేసుకు వచ్చే ఆటగాళ్లలో ముందు వరుసలో ఉంటాడు భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్ , మాజీ కోచ్ వసీం జాఫర్(Wasim Jaffer).
మన జట్టు పూర్తిగా బాధ్యతా రాహిత్యంతో ఆడిందంటూ మండిపడ్డాడు. ఆపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై నిప్పులు చెరిగాడు. భారత జట్టు కీలక సమయంలో చేతులెత్తేసిందని ప్రత్యేకించి సూర్య కుమార్ యాదవ్ ఆశించిన మేర రాణించ లేదని ఆరోపించాడు జాఫర్. ఇంగ్లండ్ తో అంతకు ముందు పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లోనూ సత్తా చాటలేదని మండిపడ్డాడు.
ఇక భారత బౌలింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువేనని ఆగ్రహం వ్యక్తం చేశాడు. మన జట్టు కంటే దాయాది పాకిస్తాన్ బౌలింగ్ 100 శాతం బాగుందంటూ ప్రశంసలతో ముంచెత్తాడు. బలమైన భారత జట్టుకు నాయకుడిగా ఉన్న రోహిత్ శర్మ తనకేమీ పట్టనట్లు వ్యవహరించాడని ఇలాగైతే టీం ఎలా గెలుస్తుందని ప్రశ్నించాడు వసీం జాఫర్(Wasim Jaffer).
పూర్తిగా జట్టును ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నాడు. ఎంతో మంది ప్రతిభ కలిగిన ఆటగాళ్లు ఉన్నారని వారిలో రెండు మూడు టీమ్ లుగా తయారు చేసి ప్రొఫెషనల్స్ గా మార్చాలని సూచించాడు. ఇదే సమయంలో సూర్య భాయ్ తో పాటు హిట్ మ్యాన్ ను ఏకి పారేశాడు వసీం జాఫర్.
Also Read : బీబీసీ వరల్డ్ కప్ టీంలో ముగ్గురికి ఛాన్స్