Rohit Sharma : మేమంతా అన్నదమ్ములం – రోహిత్ శర్మ
పాకిస్తాన్, భారత్ మ్యాచ్ పై కామెంట్స్
Rohit Sharma : మరో మెగా ఈవెంట్ జరిగేందుకు రెడీ అవుతోంది ఆస్ట్రేలియా. అక్టోబర్ 16 నుంచి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టి20 వరల్డ్ కప్ 2022 ప్రారంభం కానుంది. మొత్తం 16 జట్లు పాల్గొంటున్నాయి. ప్రారంభ మ్యాచ్ నమీబియా , శ్రీలంక జట్ల మధ్య జరుగుతుంది. భారీ ఎత్తున ప్రైజ్ మనీ దక్కనుంది గెలిచిన జట్టుకు. నవంబర్ 13న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.
ఆరోజు ప్రపంచ విజేత ఎవరో తేలిపోతుంది. ప్రస్తుతం పాల్గొనే జట్లలో భారత్, పాకిస్తాన్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా టైటిల్ ఫేవరేట్ గా ఉన్నాయి. ఇక టి20 ఫార్మాట్ లో ఎవరు ఎప్పుడు గెలుస్తారో చెప్పలేం. ఇక టోర్నీలో ప్రధాన పోటీ దాయాదులైన చిరకాల ప్రత్యర్థులుగా పేరొందిన భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య అక్టోబర్ 23న జరగనుంది.
ఇప్పటికే మొత్తం టికెట్లు అమ్ముడు పోయినట్లు టాక్. ఐసీసీ 16 మంది కెప్టెన్లతో ఫోటో సెషన్ నిర్వహించింది ఐసీసీ. ఈ సందర్భంగా భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడారు. తాము శత్రువులమని అనుకుంటారు. అది పూర్తిగా తప్పు. మేం మంచి స్నేహితులం అంతకు మించి అన్నదమ్ములమని పేర్కొన్నాడు.
ప్రస్తుతం భారత కెప్టెన్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి. తాము మ్యాచ్ వరకే ఆడతామని ఆ తర్వాత ఇతర విషయాలు, కుటుంబాల యోగ క్షేమాల గురించి చర్చించు కుంటామని చెప్పాడు. ఇదిలా ఉండగా రోహిత్ శర్మ(Rohit Sharma) చేసిన వ్యాఖ్యలను చూసైన పీసీబీ చైర్మన్ రమీజ్ రజా మారితే బెటర్ అని నెటిజన్లు పేర్కొంటున్నారు.
Also Read : ఆసియా కప్ టీమిండియాదే