Kamral Akmal : పాకిస్తాన్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తామిద్దరం మంచి స్నేహితులమని పేర్కొన్నాడు. ఆటలో భాగంగా చోటు చేసుకున్న అపార్థం వల్ల ఆనాడు ఆ ఘటన చోటు చేసుకుందన్నాడు.
అక్మల్ మరోసారి గుర్తు చేసుకున్నాడు. 2010 ఆసియా కప్ లో భాగంగా పాకిస్తాన్ జరిగిన గొడవ గురించి తెలిపాడు. తామిద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశాడు అక్మల్.
ఇద్దరి మధ్య సరైన అవగాహన లేక పోవడం వల్లనే అలా జరిగిందని పేర్కొన్నాడు ఈ మాజీ పాకిస్తాన్ క్రికెటర్. గౌతం గంభీర్ అద్భుతమైన క్రికెటరే కాదు మంచి వ్యక్తి అని కితాబు ఇచ్చాడు కమ్రాన్ అక్మల్(Kamral Akmal ).
లెజెండ్స్ లీగ్ క్రికెట్ – ఎల్ఎల్సీ ఇన్ స్టా గ్రామ్ లో తన అభిప్రాయాను పంచుకున్నాడు. గౌతం గంభీర్ తో పాటు హర్భజన్ సింగ్ తో తనకు మంచి సాన్నిహిత్యం ఉందని తెలిపాడు.
ఇద్దరితో ఎలాంటి శత్రుత్వం లేదని, సరిగ్గా అర్థం చేసుకోక పోవడం వల్లనే జరిగిందని పేర్కొన్నాడు అక్మల్. ఆసియా కప్ లో గంభీర్ తో నాకు అపార్థం ఏర్పడింది.
అంతే తప్ప ఆ తర్వాత ఇద్దరం కలిసి మేం ఎన్నో మ్యాచ్ లు ఆడాం. క్రికెట్ గురించి ఎన్నో మాట్లాడుకున్నామని స్పష్టం చేశాడు కమ్రాన్ అక్మల్(Kamral Akmal ).
ఒకే జట్టులో సభ్యులగా కలిసి ఆడడం ఆనందంగా ఉందన్నాడు. ఎలాంటి పోటీ లేదు. మా మధ్య ఎలాంటి ఆధిపత్య భావన కూడా లేదు. ఇద్దరం రిటైర్మెంట్ అయ్యాం. కానీ మా స్నేహం అలాగే ఉందన్నాడు.
ఈ మ్యాచ్ లో మూడు వికెట్ల తేడాతో ఇండియా గెలుపొందిందని తెలిపాడు. విచిత్రం ఏమిటంటే 83 పరుగులు చేసి జట్టులో కీలక పాత్ర గంభీర్ పోషించాడని కితాబు ఇచ్చాడు.
Also Read : చరిత్ర సృష్టించనున్న టీమిండియా