Alluri Seetarama Raju Krishna : మ‌న్నెం వీరుడి చిత్రం మ‌రిచి పోలేం

అత‌డు అల్లూరి సీతారామ‌రాజు

Alluri Seetarama Raju Krishna  : సూప‌ర్ స్టార్ కృష్ణ ఇక లేర‌న్న వార్త ఇప్ప‌టికీ జీర్ణించు కోలేక పోతోంది తెలుగు వెండితెర. ఆయ‌న చేసిన‌న్ని ప్ర‌యోగాలు ఇంకే న‌టుడు చేయ‌లేదు. న‌టుడిగా, దర్శ‌కుడిగా, నిర్మాత‌గా త‌న‌దైన ముద్ర వేశారు. రోజుకో కండువా క‌ప్పుకునే ఈ రోజుల్లో న‌ట శేఖ‌రుడు మాత్రం చివ‌రి దాకా కాంగ్రెస్ కండువాతోనే క‌లిసి ఉన్నారు.

ఇది ఆయ‌న వ్య‌క్తిత్వానికి మ‌చ్చుతున‌క‌. ఇక సూప‌ర్ స్టార్ కృష్ణ అనేస‌రిక‌ల్లా మొద‌ట‌గా గుర్తుకు వ‌చ్చేది మ‌న్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు సినిమా. తెలుగు సినిమా రంగాన్ని ఒక ఊపు ఊపింది. ఆ ఒక్క సినిమా దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారి తీసింది.

అందులోని ప్ర‌తి డైలాగ్ ఇప్ప‌టికీ ఎప్ప‌టికీ ఎవ‌ర్ గ్రీన్ గా ఉండి పోతుంది. గ్రామీణ ప్రాంతాల‌ను, ముఖ్యంగా రైతాంగ‌పు స‌మ‌స్య‌ల‌ను ఎక్కువ‌గా ప్ర‌స్తావించేలా సినిమాలు తీసిన ఘ‌న‌త న‌ట శేఖ‌ర కృష్ణ‌దే అని చెప్ప‌క త‌ప్ప‌దు. ఆల్ టైమ్ హిట్స్ ల‌లో ఒక‌టిగా నిలిచేలా చేసింది ఈ చిత్రం.

మ‌న్యం దొర అల్లూరు సీతారామ రాజు పాత్ర‌కు జీవం పోసిన న‌టుడు కృష్ణ‌(Alluri Seetarama Raju Krishna). పౌరాణికాల్లోనే కాదు చారిత్ర‌క పాత్ర‌ల‌కు జీవం పోసిన ఘ‌న‌త కృష్ణ‌కే ద‌క్కుతుంది. త‌లుగు ప్ర‌జ‌ల‌నే కాదు యావ‌త్ భార‌త దేశంలో మ‌న్నెం వీరుడిపై తీసిన మూవీ సంచ‌ల‌నం క‌లిగించింది. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆద‌రించింది.

ఆ త‌ర్వాత తీసిన ప్ర‌జా రాజ్యం మూవీ కూడా రైతులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించింది. అవినీతిని ఎండ‌గ‌డుతూ తీసిన జ‌మ‌ద‌గ్ని మూవీ కూడా జ‌నాద‌ర‌ణ పొందింది. మొత్తంగా సూప‌ర్ స్టార్ కృష్ణ న‌ట‌న‌, డైలాగులు, తీసిన సినిమాలు మ‌రిచి పోలేనివి. ఎల్ల‌ప్ప‌టికీ గుర్తు పెట్టుకునేలా ఉంటాయి.

Also Read : వెండి తెర‌పై కృష్ణ చెర‌గ‌ని ముద్ర‌

 

Leave A Reply

Your Email Id will not be published!