Uma Bharti : మద్యం షాపుల్లో ఆవుల షెడ్లు తెరుస్తాం
మాజీ సీఎం ఉమా భారతి షాకింగ్ కామెంట్స్
Uma Bharti : మధ్యప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉమా భారతి(Uma Bharti) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఎంత మాత్రం వేచి ఉండే ప్రసక్తి లేదన్నారు. మద్యం దుకాణాలను మూసి వేస్తామని వాటి స్థానంలో ఆవుల షెడ్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. మద్యం పాలసీ కోసం తాము ఎదురుర చూడమన్నారు.
నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్న లిక్కర్ షాపులలో గోశాల కేంద్రాలుగా మారుస్తామని స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్ లో మహిళలపై నేరాల పెరుగుదలను మద్యపానానికి అనుసంధానం చేయాలన్నారు. రూల్స్ కు విరుద్దంగా నిర్వహిస్తున్న లిక్కర్ షాపులను మార్చాలని ఆమె గత కొంత కాలంగా కోరుతున్నారు.
దీనిపై ఇంకా బీజేపీ స్పందించ లేదు. భోపాల్ లోని ఓ దేవాలయంలో నాలుగు రోజుల పాటు బస చేశారు. అనంతరం రాష్ట్రంలో నియంత్రిత మద్యం పాలసీ కోసం తన డిమాండ్ కు మద్దతుగా మధుశాలల్లో గో శాలలు తెరుస్తామని స్పష్టం చేశారు ఉమా భారతి(Uma Bharti). రాజధాని లోని అయోధ్య నగర్ ట్రై సెక్షన్ లోని మద్యం దుకాణానికి సమీపంలో ఉన్న ఆలయానికి చేరుకున్నారు.
ప్రభుత్వం కొత్తగా ప్రకటించే మద్యం పాలసీ కోసం వేచి చూస్తూ జనవరి 31 దాకా ఇక్కడే ఉంటానని ప్రకటించారు మాజీ సీఎం. ఇదిలా ఉండగా గత కొంత కాలం నుంచీ ఉమా భారతి మధ్యప్రదేశ్ లో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా మద్యం ఏరులై పారుతుండడాన్ని తప్పు పట్టారు ఆమె.
Also Read : మేల్కోక పోతే దేశాన్ని అమ్మేస్తారు – రాహుల్