IAF Chief : ఎయిర్ ఫోర్స్ లో వెపన్ సిస్టమ్ బ్రాంచ్
ఎయిర్ చీఫ్ మార్షన్ వివేక్ రామ్ చౌదరి
IAF Chief : భారత్ ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి సంచలన ప్రకటన చేశారు. అక్టోబర్ 8 ఎయిర్ ఫోర్స్ డే సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది నుంచి వెపన్ సిస్టమ్ బ్రాంచ్ (ఆయుధ వ్యవస్థ శాఖ ) ను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. అంతే కాకుండా ఎయిర్ ఫోర్స్ లో మహిళా అగ్ని వీర్స్ ను నియమించుకుంటామని చెప్పారు.
ఇదిలా ఉండగా 75 ఏళ్ల తర్వాత దేశానికి స్వతంత్రం వచ్చిన ఇన్నేళ్ల అనంతరం కొత్త కార్యాచరణ శాఖను సృష్టించడం ఇదే తొలిసారి అని ప్రకటించారు. ఇవాళ దేశ వ్యాప్తంగా వైమానిక ద దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించు కుంటున్నామని తెలిపారు. వచ్చే ఏడాది నుంచి వీసీబీతో పాటు మహిళా అగ్ని వీర్స్ ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు వీఆర్ చౌదరి.
ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని స్పష్టం చేశారు. తప్పనిసరిగా ఫోర్స్ లోని అన్ని రకాల తాజా ఆయుధ వ్యవస్థలను నిర్వహిస్తుందని పేర్కొన్నారు ఎయిర్ చీఫ్ మార్షల్ (IAF Chief). దీని వల్ల రూ. 3,400 కోట్లు ఆదా చేస్తుందని చెప్పారు. మహిళా అగ్ని వీర్ లను చేర్చుకునేందుకు ఫోకస్ పెట్టామన్నారు.
చండీగఢ్ లో ఐఏఎఫ్ ఆధ్వర్యంలో ప్రదర్శన చేపట్టారు. అంతే కాకుండా కొత్త యూనిఫాంను ఆవిష్కరించారు ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి. అగ్నిపథ్ పథకం ద్వారా భారత వైమానిక దళంలోకి వైమానిక యోధులను చేర్చడం ఒక సవాలుగా మారిందన్నారు. వీరిని చేర్చుకోవడం వల్ల భారత భద్రతా బలగాలకు అదనపు బలం చేకూరుతుందని స్పష్టం చేశారు.
Also Read : సీఎన్జీ..పీఎన్జీ గ్యాస్ ధరలు పెంపు