Sanket Sargar : రజత పతక విజేత సంకేత్ సర్గర్
కామన్వెల్త్ గేమ్స్ 2022లో సత్తా
Sanket Sargar : బ్రిటన్ లోని బర్మింగ్ హోమ్ వేదికగా కామన్వెల్త్ గేమ్స్ 2022 ప్రారంభమయ్యాయి. భారత దేశానికి సంబంధించి వెయిట్ లిప్టింగ్ విభాగంలో పతకం దక్కింది.
ఇండియాకు చెందిన వెయిట్ లిఫ్టర్ సంకేత్ సర్గర్ చరిత్ర సృష్టించాడు. రజత పతకాన్ని సాధించాడు. కొద్ది తేడాతో బంగారు పతకాన్ని కోల్పోయాడు.
తీవ్ర నిరాశకు లోనయ్యాడు కాగా క్లీన్ అండ్ జెర్క్ రౌండ్ లో తన రెండో ప్రయత్నంలో అకాల గాయం అతనిని వెనక్కి నెట్టింది. పురుషుల 55 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో సంకేత్ మహదేవ్ సర్గర్(Sanket Sargar) ఈ ఘనత సాధించాడు.
శనివారం రెండో రోజున మొత్తం 248 కేజీల (113+135) లిఫ్ట్ తో రజత పతకాన్ని సాధించాడు. కొద్ది పాటి తేడాతో పతకం కోల్పోవడంతో తీవ్ర ఇబ్బంది పడ్డాడు.
అందరినీ ఆశ్చర్య పరిచేలా ఈ 21 ఏళ్ల వయస్సు కలిగిన భారతీయుడు తన చివరి ప్రయత్నంలో ఈ పతకాన్ని సాధించాడు. కాగా అతడి కుడి మోచేయి అతనికి భారాన్ని మోయలేకుండా చేసింది.
ఉత్కంఠ భరితమైన ముగింపులో మలేషియాకు చెందిన బిన్ కస్డన్ మొహమ్మద్ అనిక్ క్లీన్ అండ్ జెర్క్ లో కామన్వెల్త్ గేమ్స్ రికార్డు 142 కిలోలు ఎత్తి క్లీన్ అండ్ జెర్క్ రౌండ్ లో తన చివరి ప్రయత్నంలో 249 కిలోల విభాగంలో బంగారు పతకాన్ని సాధించాడు.
ఇక శ్రీలంకకు చెందిన దిలంక ఇసురు కుమార యోదగే 225 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించాడు. ఇదిలా ఉండగా సంకేత్ అత్యుత్తమ లిఫ్ట్ ని తన మొదటి ప్రయత్నంలో సాధించాడు. మహారాష్ట్రలో జన్మించాడు.
Also Read : పాకిస్తాన్ కు షాకిచ్చిన బార్బడోస్