Singer Arijit Singh : సింగ‌ర్ అరిజిత్ సింగ్ క‌చేరి ర‌ద్దు

ఫిబ్ర‌వ‌రి 18 క‌న్స‌ర్ట్ కు నో ప‌ర్మిష‌న్

Singer Arijit Singh : దేశంలో మోదీ ప్ర‌భుత్వం కొలువు తీరాక మ‌నుషులు విడి పోతున్నారు. చివ‌ర‌కు మీడియాతో పాటు క‌ళాకారులు కూడా వేర‌వుతున్నారు. తాజాగా ప్ర‌ముఖ సింగ‌ర్ అరిజిత్ సింగ్(Singer Arijit Singh) చేప‌ట్టాల్సిన క‌చేరికి అనుమ‌తి ఇవ్వ‌బోవ‌డం లేదంటూ స్ప‌ష్టం చేసింది ప‌శ్చిమ బెంగాల్ ప్ర‌భుత్వం.

అరిజిత్ సింగ్ 2023 ఫిబ్ర‌వ‌రి 18న క‌న్స‌ర్ట్ నిర్వ‌హించాల‌ని ముందుగానే ప్లాన్ చేసుకున్నారు. ఈనెల ప్రారంభంలోనే కోల్ క‌తా ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ వేదిక‌పై అరిజిత్ సింగ్ పాల్గొన్నాడు కూడా. కుంకుమ పువ్వుపై మ‌రో వివాదం త‌లెత్త‌డంతో ఇది పూర్తిగా రాజ‌కీయ దురుద్దేశంతో కూడుకుని ఉన్న‌దంటూ భార‌తీయ జ‌న‌తా పార్టీ ఆరోపించింది.

ఇదిలా ఉండ‌గా తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో ప్ర‌భుత్వం అదే ప్రాంతంలో జ‌రిగిన జీ20 ఈవెంట్ ను ఉటంకిస్తూ అనుమ‌తిని నిరాక‌రించింది. అయితే అరిజిత్ సింగ్(Singer Arijit Singh) రంగ్ దే తు మో హే గెరువా అనే పాట పాడినందుకే కావాల‌ని క‌క్ష క‌ట్టిందంటూ ఆరోపించారు బీజేపీ నాయ‌కుడు అమిత్ మాల్వియా.

హిందూ జాతీయ వాద భావ‌జాలాన్ని వ్యాప్తి చేస్తున్న తమ పార్టీ అంటే టీఎంసీ చీఫ్ , బెంగాల్ సీఎం ఒప్పు కోవడం లేదంటూ ఆరోపించారు. కాగా అరిజిత్ సింగ్ కోల్ క‌తా ఇంట‌ర్నేష‌న‌ల్ ఫెస్టివ‌ల్ లో దిల్ వాలే లో న‌టించిన షారుక్ ఖాన్ పాట‌ల‌ను పాడాడు. ఇత‌ర పాట‌లు కూడా పాడాడు.

ఇదిలా ఉండ‌గా అమిత్ మాల్వియా త‌న ట్వీట్ లో న‌టుడు బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ స్వేచ్చ‌, స‌మాన‌త్వం, పౌరుల హ‌క్కులు గురించి ప్ర‌స్తావించ‌డాన్ని ఎద్దేవా చేశారు. ఇప్పుడు ఎక్క‌డ ఉంది స్వేచ్ఛ అని ప్ర‌శ్నించారు బీజేపీ నేత‌.

Also Read : అనంత్ రాధికా నిశ్చితార్థం

Leave A Reply

Your Email Id will not be published!