AP Comment : భ‌ద్ర‌త స‌రే సౌక‌ర్యాల మాటేంటి..?

కోట్ల‌ల్లో ఆదాయం కానీ భ‌క్తుల‌కు ఇక్క‌ట్లే

AP Comment : క‌లియుగంలో ఏకైక ఆదాయం క‌లిగిన దేవుడిగా పేరొందిన తిరుమ‌ల‌లో భ‌క్తుల అగ‌చాట్లు అన్నీ ఇన్నీ కావు. రోజుకు కోట్ల‌ల్లో ఆదాయం ద‌క్కుతోంది.

ప్ర‌పంచంలో ఉన్న దేవుళ్ల‌లో అత్య‌ధిక ఆదాయం క‌లిగిన దేవ దేవుడిగా పూజ‌లు అందుకుంటున్నారు శ్రీ వేంక‌టేశ్వ‌రుడు. కోట్లాది మంది భ‌క్తుల‌కు ఆయ‌న ఆరాధ్య దైవం.

దివంగ‌త సీఎం ఎన్టీఆర్ , ఈవీ కేఆర్ కే ప్ర‌సాద్ పుణ్యమా అని నిత్య అన్న‌దానం కొన‌సాగుతూ వ‌స్తోంది. కానీ రాను రాను గ‌ణ‌నీయంగా ఆస్తులు, బంగారం, నోట్ల క‌ట్ట‌లు స‌మ‌కూరుతున్నా భ‌క్తుల‌కు మాత్రం ఇక్క‌ట్లు త‌ప్ప‌డం లేదు.

గ‌తంలో శ్రీ‌వారి ప్ర‌సాదం, అన్న‌దానం అంటే ఎంతో ప్ర‌సిద్ది ఉండేది. పామ‌రులకైనా పండితుల‌కైనా ధ‌న‌వంతులైనా అంద‌రికీ అదే ప్ర‌సాదం మ‌హా భాగ్యంగా భావించే వారు. కానీ ఇప్పుడు సీన్ మారింది.

మ‌నుషులు చూసి బొట్లు పెట్టే వారు ఎక్కువై పోయారు. చేతులు త‌డ‌పనిదే రూంలు, టికట్లు దొర‌క‌డం లేద‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

గ‌త కొంత కాలం నుంచీ టీటీడీ విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నా నిత్యం భ‌క్తులు మ‌హా ప్ర‌సాదంగా భావించే ల‌డ్డూ, అన్న‌దానం లో నాణ్య‌త లోపించింద‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

ఇక టీటీడీ పాల‌క మండ‌లి రాజ‌కీయ నాయ‌కులు, వ్యాపారుల‌కు క‌ల్ప‌త‌రువుగా మారింద‌న్న విమ‌ర్శ‌లు(AP Comment) లేక పోలేదు. ఇప్ప‌టికైనా అన్నాద‌నం, గ‌దుల వ‌స‌తి, ప్ర‌సాదం (ల‌డ్డూ ) ప‌ట్ల టీటీడీ ఫోక‌స్ పెట్టాల‌ని కోరుకుంటున్నారు భ‌క్తులు.

దైవ దర్శ‌నం అంద‌రికీ స‌మానంగా ఉండాలి. కానీ రూ. 10 ల‌క్ష‌లు, రూ. 10 వేలు, సిఫార‌సు లేఖ‌ల ఆధారంగా భ‌క్తుల‌ను కేట‌గిరీల వారీగా ద‌ర్శ‌నం ద‌క్కుతోంది. ఇక‌నైనా టీటీడీ మారాలి.

Also Read : శ్రీ‌వారి ఆస్తుల‌కు ఆధునిక భ‌ద్ర‌త

Leave A Reply

Your Email Id will not be published!