Rohit Sharma : ప్రపంచ క్రికెట్ లో మోస్ట్ పాపులర్ ఆటగాళ్లలో రోహిత్ శర్మ ఒకడు. అలవోకగా సిక్స్ లు కొట్టడంలో దిట్ట. సుదీర్ఘ కాలం పాటు భారత క్రికెట్ జట్టుకు నాయకత్వం వహించిన విరాట్ కోహ్లీ స్థానంలో అన్ని ఫార్మాట్ లకు కెప్టెన్ (Rohit Sharma)గా ఎంపికయ్యాడు.
అంతేనా అద్భుతమైన కెప్టెన్సీతో ఆకట్టుకున్నాడు. భారత్ కు విజయాలు సాధించి పెట్టడంలో కీలకంగా మారాడు. కానీ గత ఏడాది దుబాయి వేదికగా జరిగిన ఐపీఎల్ 14వ సీజన్ లో తాను నాయకత్వం వహిస్తున్న ముంబై ఇండియన్స్ తీవ్ర నిరాశ కనబర్చింది.
ఫ్యాన్స్ ను తీవ్ర నిరాశలోకి నెట్టేసింది. ఇక ఈసారి ముంబై వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2022 రిచ్ లీగ్ 15వ సీజన్ లో నైనా ముంబై ఇండియన్స్ సత్తా చాటుతుందని భావించారు అంతా.
కానీ సేమ్ సీన్ మొదలైంది. ఐపీఎల్ ప్రారంభమైనా ఇప్పటి దాకా బోణీ కొట్ట లేదు ముంబై ఇండియన్స్ . ఇక కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో అభిమానులను నిరాశ పరుస్తూ బాధ్యతా రాహిత్యంతో అవుటయ్యాడు.
మొదటి మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ తో 41 రన్స్ చేస్తే రాజస్తాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో 10 పరుగులు చేసి ఊసురు మనిపించాడు.
ఇక కీలకమైన కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో మొత్తం 12 బంతులు ఎదుర్కొన్నాడు. కేవలం మూడంటే మూడు పరుగులు చేశాడు. చెత్త ప్రదర్శనతో తీవ్ర నిరాశకు గురి చేశాడు.
Also Read : హార్దిక్ పాండ్యాపై ఎంఎస్కే కామెంట్