Team India Asia Cup 2022 : అసలు టీమిండియాకు ఏమైంది
లోపం జట్టులోనా లేక బీసీసీఐ లోనా
Team India Asia Cup 2022 : ఐపీఎల్ లో సత్తా చాటిన ఆటగాళ్లు. ఆ తర్వాత జరిగిన పలు సీరీస్ లలో భారత జట్టు సత్తా చాటింది. కానీ అసలైన సమయంలో చేతులెత్తేయడం అలవాటుగా మారింది మన ఆటగాళ్లకు.
పరుగుల వీరులున్నారు. బెంబేలెత్తించే బౌలర్లు మన స్వంతం. కానీ లీగ్ మ్యాచ్ లో సత్తా చాటారు. చివరకు సూపర్ -4 లో వరుసగా ఓటమి పాలై అపఖ్యాతి మూటగట్టుకున్నారు.
ఇలాగే ఆడుతూ పోతే ఇదే జట్టును కంటిన్యూ చేస్తే భారత జట్టు ఆస్ట్రేలియాలో త్వరలో జరగబోయే టి20 వరల్డ్ కప్ లో చాప చుట్టేయడం ఖాయం.
ఆడే వాళ్లను పక్కన పెట్టడం. ఇష్టం వచ్చినట్టుగా కెప్టెన్లను మార్చడం, ప్రయోగాలు చేయడం అలవాటుగా మారింది భారత క్రికెట్ నియంత్రణ
మండలి (బీసీసీఐ)కి. మూడు మ్యాచ్ లలో పర్వాలేదని అనిపించిన విరాట్ కోహ్లీ కీలక సమయంలో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
దంచి కొడతారని భావించిన కేఎల్ రాహుల్ , రిషబ్ పంత్, పాండ్యా చేతులెత్తేశారు. అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో పూర్తిగా ఆశించిన మేర ప్రదర్శనతో ఆకట్టు కోలేక పోయారు.
ప్రత్యర్థి జట్టు ఎక్కడా తగ్గకుండా ఆడుతూ వెళ్లారు. టి20 మ్యాచ్ లో ఎవరు ఎప్పుడు గెలుస్తారో చెప్పడం కష్టం. ప్రారంభ మ్యాచ్ ల్లోనే శ్రీలంక
ఆఫ్గనిస్తాన్ చేతిలో ఓటమి పాలైంది.
ఆ తర్వాత పుంజుకుంది. నేరుగా ఫైనల్ కు చేరింది. ఇక పాకిస్తాన్ కూడా భారత్ తో జరిగిన మ్యాచ్ లో పరాజయం పాలైనా ఆ తర్వాత
సూపర్ 4లో దంచి కొట్టింది.
లంకేయులను తక్కువ అంచనా వేసిన భారత జట్టు(Team India Asia Cup 2022) ఊహించని రీతిలో ఓటమి మూటగట్టుకుంది. మొత్తంగా
ఇలాంటి జట్టును ప్రకటించిన బీసీసీఐ మరోసారి ఎక్కడ తప్పులు చేస్తున్నామనే దానిపై ఫోకస్ పెట్టాలి.
పనిలో పనిగా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఏం చేస్తున్నాడనేది కూడా చూసుకోవాలి. ఇకనైనా ఆస్ట్రేలియాలో సత్తా చాటాలంటే వీళ్లను మార్చాలి.
పరుగుల వీరులను పట్టుకోవాలి. భారంగా మారిన వాళ్లను పక్కన పెట్టాల్సిందే. ఆటగాళ్ల కంటే దేశం ముఖ్యం. విజయం అంతకన్నా అవసరం. ఇకనైనా
బీసీసీఐ గుణ పాఠాలు నేర్చుకుంటుందని ఆశిద్దాం.
Also Read : అబ్బా లంకేయుల దెబ్బ