Disha Commission Report : దిశ కమిషన్ రిపోర్టులో ఏముంది..?
10 మంది ఖాలీను విచారించాల్సిందే
Disha Commission Report : దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది దిశ కేసు. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు దిశపై ఏర్పాటు చేసిన కమిషన్ రిపోర్టుపై కీలక వ్యాఖ్యలు చేసింది.
జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలో విచారణ చేపట్టిన ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సమస్య సున్నితమైనది. ఈ నివేదిక తమకు అందింది. దీనిని బహిర్గతం చేయడం వల్ల సమాజానికి మరింత చెరుపు చేసే ప్రమాదం ఉందని భావిస్తున్నాం.
అందుకే దిశ కేసుకు సంబంధించి అంతిమ నిర్ణయాన్ని తెలంగాణ హైకోర్టుకు వదిలి వేస్తున్నట్లు స్పష్టం చేశారు ఎన్వీ రమణ.
దిశ(Disha Commission Report) ఘటనపై ఏర్పాటైన కమిషన్ అందిజేసిన నివేదికలో ఏముందనేది ఉత్కంఠ రేపింది.
ఇదిలా ఉండగా తెలంగాణలోని హైదరాబాద్ శివారులో జరిగిన పోలీసు ఎన్ కౌంటర్ లో మరణించిన నలుగురు సామూహిక అత్యాచారం, హత్య చేసిన నిందితుల్లో ముగ్గురు మైనర్లేనని పేర్కొంది.
ఉద్దేశ పూర్వకంగానే కాల్పులకు గురయ్యారంటూ సంచలన ఆరోపణలు చేసింది. పోలీసుల తీరును ఎండగట్టింది. కేసు దర్యాప్తులో స్పష్టమైన
లోపాలను కూడా కమిషన్ ఎత్తి చూపింది.
హత్యకు పాల్పడిన 10 మంది పోలీసులను విచారించాలని సిఫారసు చేసింది. ఒక రకంగా ఫేక్ ఎన్ కౌంటర్లకు పెట్టింది పేరైన ఖాకీల తీరును ఎండగట్టింది కమిషన్.
2019 నవంబర్ లో వెటర్నరీ లేడీ డాక్టర్ పై సామూహిక అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనలో మహ్మద్ ఆరిఫ్, చింతకుంట కేశవులు,
జోలు శివ, జొల్లు నవీన్ నిందితులు.
ఈ నలుగురిని హైదరాబాద్ సమీపంలోని జాతీయ రహదారి -44 లో కాల్చి చంపారు. అదే హైవేపై 27 ఏళ్ల వైద్యురాలి మృత దేహం
కాలి పోయింది. ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిషన్ కీలక నివేదిక సమర్పించింది.
ఈ కేసును హైకోర్టుకు బదిలీ చేస్తున్నట్లు ప్రకటించారు జస్టిస్ ఎన్వీ రమణ. కాగా నివేదికను సీల్డ్ కవర్ లో ఉంచుతామని సీనియర్ న్యాయవాది
శ్యామ్ దివాన్ చేసిన వాదనలకు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, న్యాయమూర్తులు సూర్యకాంత్ , హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం అంగీకరించ లేదు.
ఇది ఎన్ కౌంటర్ కేసుకు సంబంధించింది. ఇక్కడ ఉంచడాని లేదా దాచడానికి ఏమీ లేదు. కమిషన్(Disha Commission Report) ఒకరిని దోషిగా నిర్దారించింది. ఈ విషయాన్ని కోర్టుకు పంపాలని అనుకుంటున్నట్లు బెంచ్ పేర్కొంది.
కాగా తుది నివేదికను దాఖలు చేసేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి వీఎస్ సిర్పుర్కర్ నేతృత్వంలోని కమిషన్ కు గత ఏడాది ఆగస్టు 3న సుప్రీంకోర్టు 6 నెలల గడువు మంజూరు చేసింది.
ఇక ఆయనతో పాటు ఇతర సభ్యులలో బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి రరేఖా సొండూరు బల్డోటా, సీబీఐ మాజీ డైరెక్టర్ డి.ఆర్. కార్తికేయన్ ఉన్నారు.
Also Read : కీలక వ్యాఖ్యలు చేసిన సీజేఐ