P Chidambaram Modi : మోదీ మోర్బీ ఘ‌ట‌న‌పై ప‌శ్చాత‌పం ఏది

ప్ర‌ధాన‌మంత్రి మోదీని నిల‌దీసిన చిదంబ‌రం

P Chidambaram Modi : కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు పి. చిదంబ‌రం(P Chidambaram) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గుజ‌రాత్ రాష్ట్రంలోని మోర్బీలో 150 ఏళ్ల చ‌రిత్ర క‌లిగిన వంతెన ఉన్న‌ట్టుండి కూలి పోయింది. ఈ ఘ‌ట‌న‌లో 141 మందికి పైగా గాయ‌ప‌డ్డారు. 171 మందికి తీవ్ర గాయాల‌య్యాయి.

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ బాధిత కుటుంబాల‌ను పరామ‌ర్శించారు. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు చ‌నిపోయిన కుటుంబాలు ఒక్కొక్క‌రికీ రూ. 4 ల‌క్ష‌లు, రూ. 2 ల‌క్ష‌లు , గాయ‌ప‌డిన వారికి ఒక్కొక్క‌రికి రూ. 50 వేల చొప్పున సాయం ప్ర‌క‌టించాయి. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ఘ‌ట‌న‌కు సంబంధించి ఎవ‌రు బాధ్యుల‌న్న విష‌యంపై చ‌ర్య‌లు తీసుకోలేద‌ని విప‌క్షాలు మండిప‌డ్డాయి.

అయితే కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయ‌కుడు భార‌త్ జోడో యాత్ర చేప‌ట్టిన రాహుల్ గాంధీ మాత్రం తాను ఈ ఘ‌ట‌న‌తో క‌ల‌త చెందాన‌ని అన్నారు. దీనిని రాజ‌కీయం చేయ‌ద‌ల్చు కోలేద‌ని స్ప‌ష్టం చేశారు. ఈ త‌రుణంలో మంగ‌ళ‌వారం తీవ్రంగా స్పందించారు పి. చిదంబ‌రం.

ఇంత ఘ‌ట‌న జ‌రిగినా ఇప్ప‌టి వ‌ర‌కు ప‌శ్చాతాపం ప్ర‌క‌టించ లేదంటూ దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీపై నిప్పులు చెరిగారు. క‌నీసం ఘ‌ట‌న‌కు సంబంధించి ఎవ‌రు దోషుల‌నే దానిపై తేల్చ‌లేద‌ని , క‌నీసం ప‌శ్చాతాపం కూడా చెప్ప‌క పోవ‌డం దారుణ‌మ‌న్నారు పి. చిదంబ‌రం.

ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి భార‌తీయ జ‌న‌తా పార్టీకి సంబంధించిన నేత‌లు కానీ, దాని అనుబంధ సంస్థ‌లు ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ ప‌రిష‌త్, భ‌జ‌రంగ్ ద‌ళ్ కు చెందిన బాధ్యులు స్పందించిన పాపాన పోలేద‌ని మండిప‌డ్డారు పి. చిదంబ‌రం.

Also Read : అద్వానీజీ అంతా కులాసాయేనా – మోదీ

Leave A Reply

Your Email Id will not be published!