Prashant Kishor : పీకే క‌టీఫ్ వెనుక కార‌ణం ఏంటి

పాత కాల‌పు పంథాలోనే కాంగ్రెస్

Prashant Kishor  : కాలం మారుతోంది. త‌రాలు మారుతున్నాయి. అభిరుచులు మారుతున్నాయి. ప్ర‌పంచంలో రాజ‌కీయ ప‌రంగా పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

కానీ సుదీర్ఘ 137 ఏళ్ల చ‌రిత్ర క‌లిగిన కాంగ్రెస్ పార్టీ మార్పును కోరుకోవ‌డం లేదు. ఓ వైపు సీనియ‌ర్లు ఇంకో వైపు జూనియ‌ర్ల మ‌ధ్య‌న ఆధిప‌త్య పోరు న‌డుస్తోంది.

ఆ పార్టీని న‌డిపించే శ‌క్తి , నాయ‌క‌త్వం లేకుండా పోయింది. దీనికి సార‌థి, ర‌థ‌సార‌థి అవ‌స‌రం. కానీ చుక్కా లేని నావ లాగా త‌యారైంది పార్టీ ప‌రిస్థితి.

భార‌తీయ జ‌న‌తా పార్టీ ఆక్టోప‌స్ లాగా అల్లుకు పోతోంది. రెండో సారి ప‌వ‌ర్ లోకి వ‌చ్చాక ఆ పార్టీ త‌న పంథాను మార్చుకుంటూ ,

అభివృద్ధి మంత్రంగా దూసుకు పోతోంది. ప్ర‌త్య‌ర్థుల‌కు అంద‌నంత దూరంలో ఉంది.

కానీ తామే ప్ర‌తిప‌క్షంగా కాంగ్రెస్ ప్ర‌జ‌ల్లో స్ప‌ష్ట‌మైన సంకేతాన్ని ఇవ్వ‌లేక పోతోంది.

ఇప్ప‌టికే అంత‌ర్గ‌త పోరుతో స‌త‌మ‌త‌మ‌వుతోంది. 2024లో సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

ఈ ఏడాది గుజ‌రాత్, హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లలో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉంది.

ఇప్ప‌టి దాకా యాక్ష‌న ప్లాన్ లేదు. విచిత్రం ఏమిటంటే అధికారంలో ఉన్న పంజాబ్ ను చేజేతులారా పోగొట్టుకుంది కాంగ్రెస్ పార్టీ.

ఈ త‌రుణంలో ఇండియ‌న్ పొలిటికల్ స్ట్రాట‌జిస్ట్, ఐ పాక్ ఫౌండ‌ర్ ప్ర‌శాంత్ కిషోర్ ప‌లు సార్లు భేటీ అయ్యారు. బ్లూ ప్రింట్ ఇచ్చారు. రోడ్ మ్యాప్ సిద్దం చేశారు. ఆయ‌న‌కు పార్టీలో చేరాల‌ని ఆఫ‌ర్ ఇచ్చింది.

కానీ ముందే గ్ర‌హించిన పీకే (Prashant Kishor ) తాను రాన‌ని చెప్పేశాడు. కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చాడు. పీకే, కాంగ్రెస్ మ‌ధ్య లోప‌ట ఏం జ‌రిగింద‌నేది ఇంకా స‌స్పెన్స్ గానే ఉంది.

కానీ తాను తిర‌స్క‌రించ‌డం వెనుక గ‌ల కార‌ణాలు కూడా పేర్కొన్నారు పీకే. పార్టీలో స‌మూల మార్పులు రావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని స్ప‌ష్టం చేశారు.

ప్ర‌శాంత్ కిషోర్ (Prashant Kishor ) ఆస‌క్తిక‌ర‌మైన ట్వీట్ చేశారు. వారు విశ్వాసం పెంచ‌డంలో విఫ‌ల‌మ‌య్యార‌ని. మొత్తంగా పీకే తెలంగాణ సీఎంతో ఒప్పందం చేసుకుని ముందుకు సాగుతారు.

Also Read : ప‌ని చేయ‌ని ‘మ‌హేళ’ మంత్రం

Leave A Reply

Your Email Id will not be published!