RS 2000 Notes RBI : రూ. 2,000 నోట్ల ఊసేది ఆర్బీకి దిక్కేది
గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థకు పరాకాష్ట
RS 2000 Notes RBI : నోట్ల రద్దుకు సరిగ్గా ఆరేళ్లు పూర్తయ్యాయి. దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi) ఎంతో ఆర్భాటంగా నవంబర్ 8, 2016లో కీలక ప్రకటన చేశారు. అర్ధరాత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. నల్ల ధనం వెలికి తీస్తానని , ఆర్థిక నేరగాళ్లను అరికడతానని, దేశం దాటి వెళ్లి దర్జాగా ఎంజాయ్ చేస్తున్న వారందరినీ తీసుకు వస్తానని ప్రకటించారు. కానీ ఒరిగింది ఏమీ లేదు. దేశానికి తీరని నష్టం చేకూర్చారు.
నోట్ల రద్దు తర్వాత కొత్త నోట్లను తీసుకు వచ్చింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI). ఇందులో నల్ల ధనం రూపు మాపుతుందని అనుకున్న మోదీకి కోలుకోలేని షాక్ ఇచ్చారు బడా బాబులు, వ్యాపారవేత్తలు, ఆర్థిక నేరగాళ్లు. నోట్ల రద్దు వల్ల సామాన్యులకు నష్టం జరుగగా డబ్బున్నోళ్లకు అత్యంత మేలు చేకూర్చింది. ఇక కొత్త నోట్లను మార్కెట్ లోకి తీసుకు వచ్చిన ఆర్బీఐకి బిగ్ షాక్ తగిలింది.
రూ. 100, రూ. 200 , రూ. 500, రూ. 20, రూ.2,000 నోట్లను కొత్తగా ముద్రించింది. కానీ విచిత్రం ఏమిటంటే భారీ ఎత్తున బ్లాక్ మనీకి దోహద పడింది మాత్రం రూ. 2,000 నోట్లు. దీంతో తాను తీసుకు వచ్చిన ఈ నోట్లు తనకే ముప్పుగా పరిణమిస్తాయని ఆర్బీఐ ఏనాడూ ఊహించ లేదు. ప్రధానంగా ప్రధానమంత్రికి బిగ్ షాక్ కూడా. నల్లధనాన్ని వెలికి తీసి సామాన్యుల జన్ ధన్ ఖాతాల్లో రూ. 15 లక్షలు జమ చేస్తానని చెప్పిన మోదీ మాట మర్చి పోయాడు.
ప్రస్తుతం ఆర్బీఐ తీసుకు వచ్చిన ఆ రూ. 2,000 నోట్లు(RS 2000 Notes RBI) ఎక్కడున్నాయనేది ఇంకా తేలాల్సి ఉంది. గత కొంత కాలంగా ఆర్థిక నేరగాళ్ల దెబ్బకు ఆ నోట్లను ముద్రించకుండా నిలిపి వేసింది ఆర్బీఐ.
ఈ మధ్య కేంద్ర దర్యాప్తు సంస్థలు జరుపుతున్న దాడులు, సోదాల్లో ఎక్కువగా రూ. 2,000 నోట్లతో పాటు రూ. 500 నోట్లు పట్టుబడుతున్నాయి. నోట్ల రద్దు సమయంలో అధిక విలువ కలిగిన కరెన్సీ నిల్వలను నిరోధించేందుకు, నల్ల ధనాన్ని అరికట్టేందుకు తీసుకు వచ్చినట్లు తెలిపింది ఆర్బీఐ.
ఇక 2016-17 ఆర్థిక సంవత్సరంలో 2,000 రూపాయలు 3,542.991 మిలియన్ నోట్లను ముద్రించినట్లు తెలిపింది ఆర్బీఐ(RS 2000 Notes RBI). ఇదే విషయాన్ని 2019లో పేర్కొంది తన నివేదికలో. 2018 మార్చి 30న రూ. 2000 విలువ కలిగిన 3,362 మిలియన్ కరెన్సీ నోట్లు చెలామణిలో ఉన్నాయని ఆనాటి ఆర్థిక మంత్రి లోక్ సభలో ప్రకటించారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో 111.507 మిలియన్ నోట్లు మాత్రమే ముద్రించారు.
2018-19లో 46,690 మిలియన్ నోట్లకు తగ్గింది. ఏప్రిల్ 2019 నుండి కొత్త రూ. 2,000 కరెన్సీ నోట్లను ముద్రించలేదు. ఇక ఫిబ్రవరి 26, 2021 నాటికి రూ. 2,000 నోట్లు 2,499 మిలియన్లు చెలామణిలో ఉన్నట్లు తేల్చింది ఆర్బీఐ. 2020-21 సంవత్సరాలలో రూ. 2,000 నోట్లు ముద్రించేందుకు ఇండెంట్ పెట్టక పోవడం విశేషం.
మొత్తంగా చూస్తే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నోట్ల రద్దు వల్ల ప్రజలకు నష్టం జరగగా బడా బాబులు, వ్యాపారవేత్తలు, ఆర్థిక నేరగాళ్లకు లాభదాయకంగా మారింది. ఇందుకు రూ. 2000 నోట్లు దోహద పడ్డాయనేది అక్షరాల వాస్తవం.
Also Read : నోట్ల రద్దు వల్ల సాధించింది ఏమిటి