Virat Kohli : అందరి కళ్లూ ఇప్పుడు భారత స్టార్ ప్లేయర్ , మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఉన్నాయి. ఇప్పటికే టీ20, వన్డే, టెస్టు ఫార్మాట్ లకు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు.
తన సుదీర్ఘ క్రికెట్ లో అత్యధిక కాలం ఏడేళ్ల పాటు టీమిండియాకు కెప్టెన్ గా వ్యవహరించాడు. భారత క్రికెట్ పరంగా చూస్తే అత్యంత విజయవంతమైన స్కిప్పర్లలో మహమ్మద్ అజహరుద్దీన్, మహేంద్ర సింగ్ ధోనీ తర్వాత విరాట్ కోహ్లీ నిలిచాడు.
యూఏఈ వేదికగా జరిగిన టీ20 క్రికెట్ మెగా లీగ్ నుంచి తప్పుకున్నాడు కోహ్లి(Virat Kohli ). ఆ తర్వాత సఫారీ టూర్ లో మూడు టెస్టుల సీరీస్ ను కోల్పోయిన వెంటనే తాను ఇక ఉండలేనంటూ ప్రకటించాడు.
దీంతో 2016 తర్వాత మొదటిసారిగా ఇవాళ సౌతాఫ్రికాతో మొదటి వన్డే మ్యాచ్ ఆడనున్నాడు కోహ్లీ. ఇక టెస్టుల పరంగా చూస్తే కోహ్లీ సారథ్యంలో టీమిండియా 68 మ్యాచ్ లు ఆడితే ఇందులో 40 మ్యాచ్ లు గెలుపొందగా 17 మ్యాచ్ లలో ఓడి పోయింది.
ఈ తరుణంలో ఇవాళ జరిగే మ్యాచ్ అత్యంత కీలకమైనది అటు భారత జట్టుకు ఇటు విరాట్ కోహ్లీకి. ఆయన సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాక మొదటిసారిగా అంటే ఆరు సంవత్సరాల తర్వాత ఆటగాడిగా మైదానంలోకి అడుగు పెట్టనున్నాడు.
ఎలాంటి వత్తిళ్లు లేకుండా బరిలోకి దిగితే రన్స్ చేసే చాన్స్ ఉంది. మునుపటి కోహ్లీ బయటకు వస్తాడని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు.
మరి కోహ్లీ రాణిస్తాడా రఫ్పాడిస్తాడా లేక చేతులెత్తేస్తాడా అన్నది వేచి చూడక తప్పదు.
Also Read : టీ20 వరల్డ్ కప్ 2022 వేదికలు ఇవే