Punjab Election : అందరి చూపు పంజాబ్ రాష్ట్రం వైపు నిలిచి ఉంది. దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాలలో జరుగుతున్న ఎన్నికలపై(Punjab Election) ఫోకస్ పెట్టాయి ప్రధాన పార్టీలన్నీ. యూపీలో మూడు విడతల పోలింగ్ ముగిసింది.
ఇంకా నాలుగు విడతలు జరగాల్సి ఉంది. ఉత్తరాఖండ్ , గోవా పూర్తయింది. ఇప్పుడు కథంతా పంజాబ్ పైనే ఉంది.
అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తిరిగి పవర్ లోకి వస్తుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
ఇక్కడ గతంలో 20 సీట్లు చేజిక్కించుకున్న ఆప్ మరోసారి తన సత్తా చాటేందుకు రెడీ అవుతోంది.
రాష్ట్రంలోని 117 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2017లో కాంగ్రెస్ పార్టీ 77 సీట్లు గెలుపొందింది.
ఈసారి సీట్లు వస్తాయో లేదోనన్న ఉత్కంఠ నెలకొంది మిగతా రాజకీయ పార్టీల కంటే ఆ పార్టీ లోనే ఉంది.
ప్రధానంగా రాష్ట్రంలో కాంగ్రెస్ తో పాటు ఆప్, శిరోమణి అకాలీదళ్ , పంజాబ్ లోక్ కాంగ్రెస్ , భారతీయ జనతా పార్టీ బరిలో ఉన్నాయి.
అమరీందర్ సింగ్ , బీజేపీ కలిసి పోటీ చేస్తున్నారు. అకాలీదళ్, బీఎస్పీ కలిసి ఉమ్మడిగా పోటీ చేస్తున్నాయి.
ఆప్ గణనీయంగా తన ఓటు బ్యాంకు పెంచుకుంటుందని సర్వేలు కుండ బద్దలు కొట్టాయి.
విచిత్రం ఏమిటంటే ఆప్ తనకు పట్టుందని భావించిన నియోజకవర్గాలలో పోలింగ్ తగ్గడం విశేషం.
ఇక ఆదివారం ఓటింగ్ ముగిసే సమయానికి 65.32 శాతం పోలింగ్ నమోదైంది.
ఆప్ సిట్టింగ్ స్థానాల్లో జరిగిన పోలింగ్ లో 2.3 శాతం నుంచి 9 శాతానికి తగ్గుదల చూపాయి.
ఇక రాష్ట్రంలో 2002లో జరిగిన ఎన్నికల్లో 65.14 శాతం పోలింగ్ నమోదు కాగా 2007లో 75.42 శాతం, 2012లో 78.3 శాతం, 2017లో 77.36 శాతం నమోదైంది.
అమృత్ సర్ వెస్ట్ లో అత్యల్పంగా 55.40 శాతం నమోదు కాగా గిద్దర్ బామాలో అత్యధికంగా 84.93 శాతం పోలింగ్ నమోదైంది. త్వరలో బాక్సులు విప్పితే అసలు బండారం బయట పడుతుంది.
ఎక్కడైనా ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగితే అది అధికార పార్టీకి అడ్వాంటేజ్ గా మారుతుందని రాజకీయ వర్గాలు పేర్కొంటాయి.
మరి పంజాబ్ పై పాగా వేసిన ఆప్ తన స్థానాల్లో తక్కువ ఓటు శాతం నమోదు కావడం దేనికి సంకేతం అన్నది ఒకింత విస్తు పోయేలా చేసింది.
Also Read : పంజాబ్ లో ‘బాద్ షా’ ఎవ్వరో