IPL 2022 : ఐపీఎల్ జ‌రిగేనా యూఏఈలో లేన‌ట్టేనా

ప్ర‌త్యామ్నాయ వేదికపై బీసీసీఐ ఆలోచ‌న

IPL 2022 : ప్ర‌పంచ క్రికెట్ లో అత్యంత మెగా రిచ్ లీగ్ ఏదైనా ఉందంటే అది ఒక్క‌టే ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ – ఐపీఎల్(IPL 2022). ఈ ఒక్క టోర్నీ నిర్వ‌హించ‌డం ద్వారా భార‌తీయ క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి – బీసీసీఐకి ఎన‌లేని ఆదాయం స‌మ‌కూరింది.

తాజాగా క‌రోనా తీవ్ర‌త మ‌రింత విజృంభిస్తోంది. ఈ త‌రుణంలో కొత్త‌గా మ‌రో వేరియంట్ ఓమిక్రాన్ సైతం త‌న ప్ర‌తాపాన్ని చూపుతోంది. నిన్న ఒక్క రోజే దేశ వ్యాప్తంగా రెండున్న‌ర ల‌క్ష‌ల మంది క‌రోనా బారిన ప‌డ్డారు.

ఈ త‌రుణంలో క‌రోనా దెబ్బ‌కు ఐపీఎల్ లీగ్ ను ఇండియాలో నిర్వ‌హిస్తుండ‌గానే వాయిదా వేసింది బీసీసీఐ. సెకండ్ ఫేస్ 2021ను త‌ట‌స్థ వేదిక అయిన యూఏఈలో నిర్వ‌హించింది.

మ‌రో వైపు ఓమిక్రాన్ వేరియంట్ కు కేరాఫ్ గా మారిన ద‌క్షిణాఫ్రికాలో నిర్వ‌హించాల‌ని యోచిస్తున్న‌ట్లు క్రికెట్ వ‌ర్గాల స‌మాచారం. ఇప్ప‌టికే ఐపీఎల్ 2022కు సంబంధించి వేలం పాట నిర్వ‌హించేందుకు డేట్స్ ఫిక్స్ చేసింది.

ఈ విష‌యాన్ని ఐపీఎల్ నిర్వ‌హ‌ణ క‌మిటీ చైర్మ‌న్ బ్రిజేష్ ప‌టేల్ వెల్ల‌డించారు. ఇందుకు సంబంధించి బెంగ‌ళూరులో ఈ వేలం పాట జ‌రుగుతుంద‌ని ప్ర‌క‌టించారు.

అయితే క‌రోనా కేసులు ఎక్కువ కావ‌డంతో అది కూడా అనుమానంగానే ఉంది. ఐపీఎల్ 2022(IPL 2022)ను యూఏఈ కాకుండా శ్రీ‌లంక లేదా వెస్టిండీస్ లేదా సౌతాఫ్రికాలో నిర్వ‌హించాల‌ని ప్లాన్ చేస్తున్న‌ట్లు స‌మాచారం.

వ‌చ్చే ఫిబ్ర‌వ‌రి 12, 13 తేదీల్లో ఐపీఎల్ వేలానికి వేళ అయ్యింది. ఇక గ‌త కొన్ని ఏళ్ల నుంచి ఐపీఎల్ స్పాన్స‌ర్ గా ఉన్న వివో స్పాన్స‌ర్ షిప్ నుంచి త‌ప్పుకుంది. దాని స్థానంలో టాటా గ్రూప్ ఎంట‌రైంది.

Also Read : రాహుల్ కు వికెట్ కీపింగ్ వ‌ద్దు

Leave A Reply

Your Email Id will not be published!