Munugodu By Poll : మునుగోడులో ఎగిరే జెండా ఎవరిదో
బీజేపీ..కాంగ్రెస్..టీఆర్ఎస్ నువ్వా నేనా
Munugodu By Poll : మునుగోడు ఉప ఎన్నికపై ఎగిరే జెండా ఎవరిదనే దానిపై టెన్షన్ నెలకొంది. ఇప్పటి వరకు నువ్వా నేనా అన్న రీతిలో నెలకొంది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర సమితికి ఇది జీవన్మరణగా మారింది. మొత్తం పాలకవర్గం అంతా మునుగోడులోనే మకాం వేసింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, చైర్మన్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు..ప్రతి ఒక్కరు గల్లీ గల్లీని జల్లెడ పట్టారు.
మొత్తం నియోజకవర్గంలో 2,41,805 మంది ఓటర్లు ఉన్నారు. ఎక్కువ మంది బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలు, ఇతర కులాలకు చెందిన వారున్నారు. కులాల వారీగా తాయిలాలు ఇచ్చారు. ప్రలోభాలకు గురి చేశారు. పెద్ద ఎత్తున నోట్ల కట్టలు వరదలా పారాయి. ఇక టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు పోటా పోటీగా ఖర్చు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఇప్పటి వరకు రూ. 6 కోట్లకు పైగా నగదు పట్టుబడిందని సమాచారం. దీనికి సంబంధించి ఈసీ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర సమితిని సీఎం కేసీఆర్ భారత రాష్ట్ర సమితిగా జాతీయ పార్టీని ప్రకటించారు. బీజేపీకి తామే ప్రత్యామ్నాయం కానున్నట్లు పేర్కొన్నారు.
ఇదే సమయంలో మునుగోడులో(Munugodu By Poll) జరిగిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. మంత్రులు కేటీఆర్, హరీష్ రావు సారథ్యంలో ఎన్నికల ప్రచారం కొనసాగింది. మిగతా మంత్రులు పర్యవేక్షించారు.
అధికార పార్టీ అన్ని అస్త్రాలను ప్రయోగించింది. ఇక కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి బీజేపీలోకి జంప్ అయి బరిలో నిలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇది ప్రతిష్టాత్మకంగా మారింది.
కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా దీనిపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఇక కాంగ్రెస్ పార్టీ పరంగా ఒకే ఒక్కడు రేవంత్ రెడ్డి అన్నీ తానై వ్యవహరించారు. ఎన్నికలను పర్యవేక్షించాల్సిన రాష్ట్ర ఎన్నికల సంఘం చేతులెత్తేసిందన్న ఆరోపణలు ఉన్నాయి.
ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ ను మార్చేసింది. మొత్తంగా మూడు పార్టీలకు రాబోయే ఎన్నికలకు రిహార్సల్ గా చూస్తున్నాయి. కేసీఆర్, బండి సంజయ్ , రేవంత్ రెడ్డిల చరిష్మా తేలనుంది.
Also Read : సీఎం కేసీఆర్ పై కృష్ణయ్య కన్నెర్ర