Munawar Faruqui : ఎవరీ మునావర్ ఫరూకీ ఏమిటా కథ
తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
Munawar Faruqui : ఎవరీ మునావర్ ఫరూకీ అనుకుంటున్నారా. దేశ వ్యాప్తంగా మోస్ట్ పాపులర్ ప్రజెంటర్. సకల సమస్యలపై ప్రస్తావిస్తూ కామెడీ షో చేస్తుంటాడు.
ప్రధానంగా బీజేపీని టార్గెట్ చేస్తూ ఆయన చేసిన షోస్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాయి. అయితే తాను కావాలని చేయడం లేదని, అదంతా వారే తప్పుగా అర్థం చేసుకున్నారంటూ ఇప్పటికే స్పష్టం చేశాడు.
ఇదిలా ఉండగా మునావర్ ఫరూకీ ఎక్కడ షోస్ నిర్వహించినా తాము అడ్డుకుని తీరుతామంటూ హిందూత్వ సంస్థలు హెచ్చరించాయి. బెంగళూరులో ఉన్నట్టుండి షో నిలిచి పోయింది.
తాజాగా ఆగస్టు 20న శనివారం మునావర్ ఫరూకీ(Munawar Faruqui) కామెడీ షో హైదరాబాద్ లో చేపట్టనున్నాడు. ఇందు కోసం తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
హైటెక్స్ లో ఈ షోను నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. అసలు ఎవరీ మునావర్ ఫరూకీ అని ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారి తీసేలా తనను తాను మల్చుకున్నాడు.
జనవరి 28, 1992లో పుట్టాడు మునావర్ ఫరూకీ. ఇప్పుడు అతడి వయస్సు 30 ఏళ్లు. గుజరాత్ లోని జునాగఢ్ స్వస్థలం. అతడు స్టాండ్ అప్ కామెడీ పేరుతో ప్రదర్శనలు ఇస్తుంటాడు.
జానర్స్ బ్లాక్ కామెడీ, సెటైర్లకు పెట్టింది పేరు. క్యారెక్టర్ కామెడీ, రాప్ , పాటలు కూడా రాస్తాడు. ప్రధానంగా వ్యంగ్యం ఎక్కువగా ఉంటుంది. రోజూ వారీ జీవితాన్ని ఆధారంగా చేసుకుని ప్రదర్శనలు ఇస్తాడు మునావర్ ఫరూకీ.
2022 లో కంగనా రనౌత్ రియాలిటీ టెలివిజన్ షో నిర్వహించిన లాక్ అప్ సీజన్-1లో పోటీదారుగా కనిపించాడు. షో విజేతగా నిలిచాడు మునావర్ ఫరూకీ.
భారతీయ ముస్లిం కుటుంబంలో పుట్టాడు.
మత పరమైన అల్లర్లలో అతడి ఇల్లు ధ్వంసమైంది. ముంబైకి తరలి వెళ్లింది. 16 సంవత్సరాల సమయంలో తల్లి మరణించింది. తండ్రి అనారోగ్యంతో బాధ పడుతున్నప్పుడు తన కుటుంబం కోసం పని చేయాల్సి వచ్చింది.
పాఠశాలలో చదువుతున్న సమయంలో పాత్రల షాప్ లో పని చేశాడు. 20వ ఏట గ్రాఫిక్ డిజైనర్ గా పని చేశాడు. ఓటీటీ ప్లాట్ ఫారమ్ లు ప్రవేశ పెడుతున్నప్పుడు హాస్యం గురించి తెలుసుకున్నాడు.
హాస్య నటుడిగా మారాడు. ఏప్రిల్ 2020లో తన ఛానల్ దావూద్, యమ్ రాజ్ అండ్ ఔరత్ అనే పేరుతో స్టాండప్ కామెడీ వీడియోను అప్ లోడ్ చేశాడు.
అతడికి స్టార్ డమ్ ను సంపాదించి పెట్టింది. ఆగస్టు 2020లో భారతీయ సంగీతకారుడు స్పెక్ట్రాతో కలిసి తన తొలి పాట జవాబ్ ని విడుదల చేశాడు.
28 ఫిబ్రవరి 2021లో ఘోస్ట్ స్టోరీ పేరుతో స్టాండప్ కామెడీ వీడియోను(Comedy Videos) అప్ లోడ్ చేశాడు. అది మరింత పాపులర్ గా మారింది. భారత దేశంలోని వివిధ
నగరాల్లో హాస్య ప్రదర్శనలు ఇచ్చాడు.
మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ లోని మున్రో కేఫ్ లో స్టాండ్ అప్ షో చేశాడు. జనవరి 2, 2021న హిందూ దేవతల గురించి హానికరమైన జోకులు వేశాడంటూ అరెస్ట్ చేశాడు.
ప్రపంచ వ్యాప్తంగా అతడికి మద్దతు పెరిగింది. సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. హాస్యం, వ్యంగ్యం లోతైన జీవితాన్ని ఆవిష్కరించే మునావర్ ఫరూకీ ఇప్పటికీ తన తీరు మార్చు కోవడం లేదు.
Also Read : బిల్కిస్ బానో దోషులను వెనక్కి తీసుకోవాలి