BR Ambedkar : స‌మున్న‌త భార‌తం అంబేద్క‌ర్ కు స‌లాం

బాబా సాహెబ్ స్ఫూర్తి దేశానికి దిక్సూచి

BR Ambedkar : భార‌త రాజ్యాంగ నిర్మాత‌, స్పూర్తి ప్రదాత డాక్ట‌ర్ బాబా సాహెబ్ భీం రావ్ అండేద్క‌ర్ జ‌యంతి(BR Ambedkar). ఈ దేశం ఇవాళ ఆయ‌న‌ను స్మ‌రించుకుంటోంది. ఆయ‌న జ‌యంతిని ఘ‌నంగా నిర్వ‌హిస్తోంది.

అంబేద్క‌ర్ ఓ వ్య‌క్తి కాదు శ‌క్తి. కోట్లాది ప్ర‌జ‌ల ఆరాధ్య దైవం. ఎంద‌రికో నేటికీ స్పూర్తిని క‌లిగిస్తూనే ఉన్నారు.

మొద‌టి భార‌త దేశ న్యాయ శాఖ మంత్రిగా కొలువు తీరిన అంబేద్క‌ర్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. జాతి యావ‌త్తు ఆయ‌న‌కు రుణ ప‌డి ఉంది.

అందుకే ఆయ‌న‌ను భార‌త‌ర‌త్న అత్యున్న‌త పుర‌స్కారంతో స‌త్క‌రించింది. స‌మున్న‌తంగా గౌర‌వించింది. న్యాయ‌వాదిగా, ఆర్థిక శాస్త్ర‌వేత్త‌గా, రాజ‌కీయ నాయ‌కుడిగా, సంఘ సంస్క‌ర్త‌గా పేరొందారు.

దేశంలో అంట‌రానిత‌నం, కుల నిర్మూల‌న కోసం కృషి చేశాడు. రాజ్యాంగ శిల్పిగా ఆయ‌న చేసిన కృషి ఎన‌లేనిది. కొలంబియా యూనివ‌ర్శిటీ నుంచి పీహెచ్ డి చేశారు.

న్యాయ‌, సామాజిక‌, ఆర్థిక శాస్త్రాల‌లో విస్తృతంగా రీసెర్చ్ చేశాడు. ప్రారంభంలో లాయ‌ర్ గా, అధ్యాప‌కుడిగా, ఆర్థిక వేత్త‌గా ప‌ని చ‌స్త్రశాడు. స్వాతంత్రం కోసం ప్ర‌య‌త్నించాడు.

ప‌త్రిక‌లు ప్ర‌చురించాడు. ద‌ళితుల హ‌క్కుల కోసం పోరాడాడు. 1956లో బౌద్ద మ‌తాన్ని స్వీక‌రించాడు. దేశ వ్యాప్తంగా ఆయ‌న పుట్టిన రోజు ఏప్రిల్ 14ను జాతీయ దినోత్స‌వంగా నిర్వ‌హిస్తారు.

అవుట్ లుక్ నిర్వ‌హించిన గ్రేటెస్ట్ పీపుల్స్ జాబితాలో అంబేద్క‌ర్ మొద‌టి ప్లేస్ లో నిలిచాడు. అంబేద్క‌ర్(BR Ambedkar) అస‌లు పేరు భీమారావు రంజీ అంబావ‌డేక‌ర్. మ‌హారాష్ట్ర‌లోని ర‌త్న‌గిరి జిల్లా అంట‌వాడ ఊరు.

మ‌హార్ కులానికి చెందిన వాడు అంబేద్క‌ర్. ఎన్నో అవ‌మానాలు ఎదుర్కొన్నాడు. కుల వివ‌క్ష‌, అంట‌రానిత‌నం క‌ళ్లారా చూశాడు. ఆనాడు బ‌రోడా మ‌హారాజు శాయాజీరావ్ గైక్వాడ్ ఇచ్చిన 25 రూపాయ‌ల‌తో చ‌దువుకున్నాడు.

బ‌రోడా సంస్థానంలో చాన్స్ ల‌భించింది. చ‌దువు కోవాల‌న్న ప‌ట్టుద‌ల గురించి చెప్పాడు . 1913లో కొలంబియా యూనివ‌ర్శిటీలో చ‌దివాడు. 1917లో తిరిగి స్వ‌దేశానికి వ‌చ్చాడు. ఒక ద‌ళితుడు గొప్ప పేరు సంపాదించ‌డం అగ్ర‌వ‌ర్ణాల‌కు మింగుడు ప‌డ‌లేదు.

ఆనాటి సంస్థానంలో సైనిక కార్య‌ద‌ర్శి అయ్యాడు. కానీ ఎవ‌రూ గౌర‌వించే వారు కాదు. 1927లో వేలాది చెరువుల్లో ద‌ళితులు నీళ్లు తాగ‌డం సంచ‌ల‌నం క‌లిగించింది. దీనికి ప్రేర‌ణ అంబేద్క‌ర్.

ఈ సంద‌ర్భంగా తిల‌క గ‌నుక అంట‌రానివాడుగా పుట్టి ఉంటే స్వ‌రాజ్యం నా జ‌న్మ హ‌క్కు అని ఉండేవాడు కాదన్నారు. గాంధీతో విభేదించాడు అండేద్క‌ర్.

1932లో క‌మ్యూన‌ల్ అవార్డును ప్ర‌క‌టించారు. రాజ్యాంగ ప‌రిషత్తు స‌భ్యుడిగా, మంత్రివ‌ర్గ స‌భ్యుడిగా ఉన్నారు. భార‌త రాజ్యాంగానికి రూప క‌ల్ప‌న చేయ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు. అందుకే ఆయ‌న‌ను దేశానికి స్పూర్తి ప్ర‌దాత‌గా పేర్కొంటారు.

Also Read : ర‌గులుతున్న ర‌ష్యా త‌గ్గ‌నంటున్న ఉక్రెయిన్

Leave A Reply

Your Email Id will not be published!