Ajay Jadeja : కెప్టెన్లను మార్చుకుంటూ పోతే ఎలా – జడేజా
ఇలాగైతే టీమిండియా గెలవడం కష్టం
Ajay Jadeja : భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్ అజయ్ జడేజా(Ajay Jadeja) బీసీసీఐ తీరుపై బాంబు పేల్చాడు. ప్రపంచ క్రికెట్ లో ఏ దేశమూ చేయనన్ని ప్రయోగాలు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు చేస్తోంది. ఇప్పటికే సెలెక్షన్ కమిటీ తీసుకున్న నిర్ణయాలు, ఆటగాళ్ల ఎంపికపై ఎన్నో విమర్శలు వచ్చాయి.
మాజీ ఫాస్ట్ బౌలర్ చేతన్ శర్మ ప్రస్తుతం సెలెక్షన్ కమిటీకి చైర్మన్ గా ఉన్నాడు. అతడి పదవీకాలం కూడా పూర్తి కానుంది. ఇదిలా ఉండగా తాజాగా ఆస్ట్రేలియా వేదికగా జరిగిన సెమీ ఫైనల్ లో ఇంగ్లండ్ చేతిలో చిత్తు చిత్తుగా ఓడి పోయింది టీమిండియా. అసలు ఆడుతున్న జట్టు మనదేనా అన్న అనుమానం కలిగింది.
రోహిత్ శర్మ కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రధానంగా కేఎల్ రాహుల్ ను ఎందుకు ఆడిస్తున్నారంటూ మండిపడుతున్నారు నెటిజన్లు. ఇదే క్రమంలో ఎలాంటి అంచనాలు లేకుండానే బరిలోకి దిగిన పాకిస్తాన్ ఫైనల్ కు చేరింది. ఇక ఇంగ్లండ్ ఆటగాళ్లు ఆడిన తీరు నభూతో నభవిష్యత్ అన్న చందంగా ఉందని పేర్కొన్నాడు అజయ్ జడేజా(Ajay Jadeja).
శుక్రవారం బీసీసీఐపై, భారత జట్టు ఆట తీరుపై ఒక రకంగా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు. భారత జట్టుకు ఒకరు మాత్రమే కెప్టెన్ గా ఉంటే సరిపోతుందని కానీ ఏడుగురు కెప్టెన్లను మారిస్తే టీమ్ భవిష్యత్తు బాగు పడదని పేర్కొన్నాడు.
ఒక రకంగా బీసీసీఐని హెచ్చరించాడు అజయ్ జడేజా. ప్రస్తుతం జడేజా చేసిన కామెంట్స్ క్రికెట్ వర్గాలలో కలకలం రేపుతున్నాయి.
Also Read : పాకిస్తాన్ ముద్దుగుమ్మ నటాషా వైరల్