Republic Day Special : గణతంత్ర దినోత్సవం ప్రత్యేకం
జనవరి 26ననే ఎందుకు జరుపుకోవాలి
Republic Day Special : దేశానికి స్వేచ్ఛ లభించిన రోజు ఆగస్టు 15న నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. మరి ప్రతి ఏటా జనవరి 26న గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నారో తెలుసా. ఈసారి ముఖ్య అతిథిగా ఈజిప్టు దేశానికి చెందిన అధ్యక్షుడు హాజరు అవుతున్నారు. భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. దేశ మంతటా గణతంత్ర వేడుకలకు సిద్దమైంది.
ఈ సందర్భంగా దేశానికి చెందిన పలు విభాగాలు ప్రదర్శనలు నిర్వహిస్తాయి. ప్రతి ఏటా కర్తవ్య మార్గంలో నిర్వహిస్తారు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ , భారత నావికా, రక్షణ దళాలు తమ సైనిక కవాతులు చేపడతాయి. ఈ ఏడాది రిపబ్లిక్ డే(Republic Day Special) పరేడ్ లో 12 మంది మహిళా రైడర్లు పాల్గొంటారు. విజయ్ చౌక్ నుండి ఎర్రకోట వరకు సంప్రదాయ మార్గంలో కావతు చేపడతారు.
ఇక ఆంగ్లేయుల పాలన నుండి స్వేచ్ఛ పొందిన సందర్భంగా పంధ్రాగష్టును జరుపుకోవడం ఆనవాయితీ. గణతంత్ర దినోత్సవం రోజు భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. అందుకనే దానికి గుర్తుగా జనవరి 26న రిపబ్లిక్ డేను నిర్వహిస్తారు. 1929న ఇదే రోజున భారత జాతీయ కాంగ్రెస్ బ్రిటీష్ పాలన డొమినియన్ హోదాను వ్యతిరేకిస్తూ భారత స్వాతంత్ర ప్రకటన (పూర్ణ స్వరాజ్ ) ను జారీ చేసింది. అందుకే జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతోంది.
1947లో స్వేచ్ఛ పొందిన తర్వాత భారత దేశానికి చెందిన అగ్ర నాయకుడు రాజ్యాంగాన్ని రూపొందించే పనిలో పడ్డారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ చైర్మన్ గా భారత దేశానికి శాశ్వత రాజ్యాంగాన్ని రూపొందించేందుకు ఆగస్టు 29న ఒక కమిటీని ఏర్పాటు చేశారు. నవంబర్ 4, 1947న కమిటీ రాజ్యాంగాన్ని రూపొందించింది. రాజ్యాంగ పరిషత్తుకు సమర్పించింది.
ఎట్టకేలకు రాజ్యాంగాన్ని ఆమోదించేందుకు ముందు రెండేళ్ల పాటు అనేకసార్లు సమావేశమైంది. జనవరి 24, 1950న 308 మంది సభ్యులు చేతి రాత సంస్కరణలపై సంతకం చేశారు. ఒకటి హిందీలో మరొకటి ఇంగ్లీష్ లో. చాలా చర్చలు, కొన్ని మార్పుల తర్వాత జనవరి 26, 1950న రాజ్యాంగం అమలులోకి వచ్చింది.
Also Read : అతిథిగా రావడం అదృష్టం – ప్రెసిడెంట్