WI vs IND 1st T20 : తొలి టి20 మ్యాచ్ లో భార‌త్ బోల్తా

4 ప‌రుగుల తేడాతో ప‌రాజ‌యం

WI vs IND 1st T20 : విండీస్ టూర్ లో భాగంగా జ‌రిగిన తొలి టి20 మ్యాచ్ లో ఆతిథ్య వెస్టిండీస్(WI vs IND 1st T20) టీం 3 ప‌రుగుల తేడాలో విజ‌యం సాధించింది. జాస‌న్ హోల్డ‌ర్ అద్భుతంగా బౌలింగ్ చేయ‌డంతో విండీస్ విక్ట‌రీ సాధ్య‌మైంది. అత్యంత క‌ట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. తొలుత బ్యాటింగ్ కు దిగింది వెస్టిండీస్. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి 149 ర‌న్స్ చేసింది. అనంత‌రం మైదానంలోకి దిగిన భార‌త్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్లు కోల్పోయి 145 ర‌న్స్ చేసింది.

WI vs IND 1st T20 Updates

తిల‌క్ వ‌ర్మ ఒక్క‌డే రాణించ‌గా మిగ‌తా ఆట‌గాళ్లు ప్ర‌భావం చూప‌లేక పోయారు. బాగా ఆడుతున్న స‌మ‌యంలో ఉన్న‌ట్టుండి సంజూ శాంస‌న్ ర‌నౌట్ అయ్యాడు. దీంతో టీమిండియా ఓట‌మి త‌ప్ప‌లేదు. ఇక జాస‌న్ హోల్డ‌ర్ 4 ఓవ‌ర్లు వేసి 19 ర‌న్స్ ఇచ్చి 2 వికెట్లు తీశాడు. ఇప్ప‌టికే టెస్టు, వ‌న్డే సీరీస్ గెలుచుకున్న భార‌త జ‌ట్టు టీ20 సీరీస్ లో భాగంగా 5 మ్యాచ్ లు ఆడాల్సి ఉంది.

దీంతో 1-0 ఆధిక్యంలో కొన‌సాగుతోంది ఆతిథ్య జ‌ట్టు. మ్యాచ్ చివ‌రి వ‌ర‌కు ఉత్కంఠ భ‌రితంగా సాగింది. చివ‌ర‌లో 30 బంతుల‌లో 37 ర‌న్స్ చేయాల్సి ఉండ‌గా జేస‌న్ మెయిడెన్ ఓవ‌ర్ వేశాడు. అంత‌కు ముందు యుజ్వేంద్ర చాహ‌ల్ , అర్ష్ దీప్ సింగ్ చెరో రెండు వికెట్లు తీశారు. విండీస్ జ‌ట్టులో పూర‌న్ 41 , పావెఎల్ 48 ర‌న్స్ చేశారు.

Also Read : Kapildev Arrogance Comment : అహంకారం క్రీడా స్పూర్తికి విరుద్దం

Leave A Reply

Your Email Id will not be published!