Rahul Dravid BCCI : ద్రవిడ్ ను మార్చనుందా బీసీసీఐ..?
విదేశీ కోచ్ ను నియమించనుందా
Rahul Dravid BCCI : రాహుల్ ద్రవిడ్ మోస్ట్ పాపులర్ క్రికెటర్. వివాద రహితుడు, సౌమ్యుడు. క్లాసికల్ ఆట తీరుతో ది లిజెండ్ అని పిలుచుకునేలా తనను తాను ప్రూవ్ చేసుకున్న మాజీ క్రికెటర్. ఇది పక్కన పెడితే భారత క్రికెట్ జట్టు సాధించిన విజయాలలో కీలకమైన పాత్ర పోషించాడు రాహుల్ ద్రవిడ్ .
ఆటగాడిగా, క్రికెట్ అకాడమీ కోచ్ గా, ప్రస్తుతం భారత జట్టు హెడ్ కోచ్ గా . భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కి ఎప్పుడైతే బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీ వచ్చాడో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. తనకు ఇష్టం లేకున్నా హెడ్ కోచ్ పదవీ బాధ్యతలు చేపట్టాడు. కానీ ఫోకస్ పెడుతున్నా టీమ్ ఇండియా ఆశించిన మేర ఫలితాలు రావడం లేదు.
ఇదే సమయంలో తనకు వెన్నుదన్నుగా నిలిచిన దాదా ఇప్పుడు లేడు. అన్ని కాలాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ట్రైనింగ్ ఇచ్చే సమయంలో చాలా కఠినంగా ఉంటాడు రాహుల్ ద్రవిడ్. ఆయనకు పని పట్ల ఉండే నిబద్దత అలాంటిది. అయితే భారత జట్టు పేలవమైన ఆట తీరుతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది.
ప్రధానంగా సెలెక్షన్ ఎంపికలో ద్రవిడ్ పాత్ర(Rahul Dravid BCCI ) ఉందా లేదా అన్న అనుమానం తలెత్తుతోంది. ఇదే సమయంలో తనకు సపోర్ట్ గా ఉన్న గంగూలీ లేడు. కానీ తన ప్రాంతానికి చెందిన రోజర్ బిన్నీ ఇప్పుడు చీఫ్ గా ఉన్నాడు.
ఆయన ఉన్నా లేనట్టేనన్న ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడంతా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తనయుడు జే షా కనుసన్నలలోనే నడుస్తోందనేది బహిరంగ రహస్యం. కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే సెలెక్షన్ కమిటీని రద్దు చేసింది. కొత్తగా దరఖాస్తులు కూడా స్వీకరించింది బీసీసీఐ.
దీంతో రాహుల్ ద్రవిడ్ ను మార్చే యోచనలో బీసీసీఐ ఉందా అన్న అనుమానం కలుగుతోంది. లేదా అతడిని అలాగే ఉంచి విదేశీ కోచ్ ను తీసుకు రానున్నట్లు క్రికెట్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
మరి ద్రవిడ్ వల్లే ఇవాళ యువ ఆటగాళ్లు పెద్ద ఎత్తున భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. అతడి కోచింగ్ సారథ్యంలోనే వారంతా దుమ్ము రేపారు..సత్తా చాటారు. ఇవాళ ఇండియన్ ప్రిమీయర్ లీగ్ లో రికార్డు ల మోత మోగిస్తున్న వారిలో ఎక్కువ మంది క్రికెటర్లు ద్రవిడ్ ట్రైనింగ్ నుంచి వచ్చిన వారే. మరి ద్రవిడ్ ను తప్పిస్తారా లేక కంటిన్యూ చేస్తారా అన్నది వేచి చూడాలి.
Also Read : రోడ్డు ప్రమాదం రిషబ్ పంత్ కు గాయం