Sanju Samson : సంజూ శాంసన్ కు ఛాన్స్ ఇస్తారా
టీ20 సీరీస్ కు ఎంపిక చేసినా కష్టమే
Sanju Samson : సంజూ శాంసన్ గురించి పరిచయం చేయాల్సిన పని లేదు. మోస్ట్ టాలెంటెడ్ , పాపులర్ కేరళ స్టార్ బ్యాటర్. ఏ ప్లేస్ లో నైనా ఏ సమయంలో నైనా ఆడగలిగే దమ్మున్న క్రికెటర్. ఒక రకంగా చెప్పాలంటే భారత క్రికెట్ జట్టులో అత్యంత అన్ లక్కీ ఫెలో క్రికెటర్ గా మిగిలి పోయాడు.
ఎవరైనా.. ఏ దేశంలో నైనా క్రీడలకు సంబంధించి ఆడే వాళ్లను జట్టు ఎంపికలో ప్రయారిటీ ఇస్తారు. వారికే పట్టం కడతారు. కానీ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) లో మాత్రం అలాంటివి పరిగణలోకి తీసుకోరారు. ఆడక పోయినా సరే మనోడై ఉంటే సరిపోతుంది. ఇక్కడ కులం కూడా ఎక్కువ ప్రభావం చూపిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి.
బీసీసీఐ ఆఫీసు ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి కేరాఫ్ గా మారి పోయింది. ఒక్క బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ తప్ప ఏ ఒక్కరు క్రికెట్ ను మైదానంలో ఆడిన దాఖలాలు లేవు. ఇక సోషల్ మీడియాలో గత ఏడాదిలో అత్యధిక సార్లు ట్రెండింగ్ లో ఉన్న ఏకైక క్రికెటర్ భారత్ నుంచి ఒకే ఒక్కడు సంజూ శాంసన్ మాత్రమే.
ఒక రకంగా కోట్లాది రూపాయలు కలిగిన బీసీసీఐ ఎక్కువసార్లు విమర్శలకు గురైంది శాంసన్(Sanju Samson) ఎంపిక విషయంలో . చివరకు ఒత్తిడి తట్టుకోలేక శ్రీలంకతో జరిగే టీ20 సీరీస్ కు ఎంపిక చేసింది బీసీసీఐ. కానీ తుది జట్టులో కూడా ఆడిస్తారన్న నమ్మకం లేదు. మొత్తంగా మౌనాన్ని ఆశ్రయిస్తూ వచ్చిన శాంసన్ కేవలం ఐపీఎల్ కే పరిమితం కానున్నాడా అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్ .
Also Read : ప్రపంచ కప్ పై ఫోకస్ జట్టుపై నజర్