BCCI Boss : బీసీసీఐ ఎన్నిక‌ల్లో బాస్ పోటీ చేస్తారా

ఐసీసీ చైర్మ‌న్ రేసులో సౌర‌వ్ గంగూలీ

BCCI Boss :  ప్ర‌పంచంలో అత్య‌ధిక ఆదాయం క‌లిగిన క్రీడా సంస్థ‌గా పేరుంది భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి (బీస‌సీఐ)కి. తాజాగా ప్ర‌స్తుత బీసీసీఐ పాల‌క వ‌ర్గం సమ‌యం ముగిసింది. ఇప్ప‌టికే ఎన్నిక‌ల‌కు సంబంధించి నోటిఫికేష‌న్ కూడా విడుద‌లైంది. దీంతో అంద‌రి క‌ళ్లు భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ , ప్ర‌స్తుత బీసీసీఐ చీఫ్ గా ఉన్న సౌర‌వ్ గంగూలీ మీదే ఉన్నాయి.

పోటీలో ఉంటాడా అన్న‌ది ఇంకా అనుమానాస్ప‌దంగా ఉంది. ఎందుకంటే త్వ‌ర‌లో ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఐసీసీ చైర్మ‌న్ రేసులో ప్ర‌ధానంగా గంగూలీ(BCCI) పేరు వినిపిస్తోంది. దీంతో ఐసీసీ ఎన్నిక‌ల్లో పోటీ చేయాలంటే బీసీసీఐ ఎన్నిక‌ల్లో ఉండ కూడ‌దు. దీంతో బీసీసీఐ ప్రెసిడెంట్ గంగూలీ అధ్య‌క్ష ప‌ద‌వి నుడి వైదొలిగే అవ‌కాశం ఉంది.

అక్టోబ‌ర్ 18న బీసీసీఐకి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ చైర్మ‌న్ ప‌ద‌వికి ఈ ఏడాది చివ‌రిలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. మ‌రి సౌర‌వ్ గంగూలీ ప్లేస్ లో ఎవ‌రు ఎన్నిక‌వుతార‌నేది ఉత్కంఠ కొన‌సాగుతూనే ఉంది. దాదా త‌ర్వాత బీసీసీఐ బాస్(BCCI Boss) రేసులో భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ క్రికెట‌ర్ రోజ‌ర్ బిన్నీ ముందంజ‌లో ఉన్న‌ట్లు స‌మాచారం.

ఇప్ప‌టికే బీసీసీఐ కీల‌క స‌మావేశం జ‌రిగింది. ఇందులో సౌర‌వ్ గంగూలీ పోటీ చేయ‌ర‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. జై షా , వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, కోశాధికారి అరుణ్ ధుమాల్ , బీసీసీఐ మాజీ చీఫ్ ఎన్ . శ్రీ‌నివాస‌న్ ల‌తో క‌లిసి గంగూలీ ఈ మీటింగ్ కు హాజ‌రైనట్లు టాక్. జే షా మాత్రం మ‌ళ్లీ కార్య‌ద‌ర్శి ప‌ద‌వికి పోటీ చేయ‌నున్నారు.

Also Read : బీసీసీఐ అధ్య‌క్షుడిగా రోజ‌ర్ బిన్నీ..?

Leave A Reply

Your Email Id will not be published!