Hardik Pandya : హార్దిక్ పాండ్యాకు ప్ర‌మోష‌న్ ద‌క్క‌నుందా

వైస్ కెప్టెన్ ఇచ్చే ప‌రిశీల‌న‌లో బీసీసీఐ

Hardik Pandya : ఈసారి ఇండియాలో జ‌రిగిన రిచ్ లీగ్ ఐపీఎల్ -2022లో ఒక్క‌సారిగా ముందుకు వ‌చ్చాడు హార్దిక్ పాండ్యా(Hardik Pandya). బెస్ట్ ఆల్ రౌండ‌ర్ ప్రద‌ర్శ‌న‌తో ఆకట్టుకున్నాడు. ఆపై గుజ‌రాత్ టైటాన్స్ కు కెప్టెన్ గా ఎంపిక‌య్యాడు.

ఆ జ‌ట్టును విజ‌య వంతంగా న‌డిపించాడు. ఆపై తొలిసారిగా ఎంట్రీతోనే రికార్డు సృష్టించాడు. త‌న జ‌ట్టుకు ఐపీఎల్ క‌ప్ ను అందించాడు.

ఆపై ప‌డుతూ లేస్తూ గాయాల పాలైన ఈ క్రికెటర్ ఉన్న‌ట్టుండి ఈ ఏడాది పూర్తిగా క‌లిసి వ‌చ్చింద‌నే చెప్పాలి. ఆపై మ‌రో ఆట‌గాడు యుజ్వేంద్ర చాహ‌ల్ సైతం త‌మ ప్ర‌తిభ‌తో ఆక‌ట్టుకున్నారు.

భార‌త క్రికెట్ జ‌ట్టులో చోటు ద‌క్కించుకున్నారు. ఊహించ‌ని రీతిలో రోహిత్ శ‌ర్మ‌, కేఎల్ రాహుల్ గాయ‌ప‌డ‌డంతో మ‌నోడికి ల‌క్ రూపంలో క‌లిసొచ్చింది.

ఏకంగా భార‌త జ‌ట్టుకు నాయక‌త్వం వ‌హించే అవ‌కాశం ద‌క్కింది. దానిని చ‌క్క‌గా స‌ద్వినియోగం చేసుకున్నాడు. భార‌త్ కు సీరీస్ తీసుకు వ‌చ్చాడు.

ప్ర‌స్తుతం బీసీసీఐ ముందు జ‌ట్టు ఎంపిక అన్న‌ది పెను స‌వాల్ గా మారింది. లెక్క‌కు మించి ఆట‌గాళ్లు ఐపీఎల్ పుణ్య‌మా అంటూ అద్భుతమైన ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకుంటున్నారు.

ఇక వైస్ కెప్టెన్ గా ఉన్న కేఎల్ రాహుల్ ఇంకా కోలుకోలేదు. తాజాగా ఈనెల లోనే అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ఆసియా క‌ప్ యుఏఈ వేదిక‌గా జ‌ర‌గ‌నుంది.

ఇందుకు గాను రోహిత్ శ‌ర్మ‌తో పాటు ఉప నాయ‌కుడిగా ఎవ‌రిని నియ‌మించాల‌నే దానిపై చ‌ర్చిస్తోంది బీసీసీఐ. ఇందుకు హార్దిక్ పాండ్యానే స‌రైన వాడంటూ డిసైడ్ అయ్యిందట‌. మ‌రి పాండ్యాకు ఆ అదృష్టం అడుగు దూరంలో ఉంద‌న్న‌మాట‌.

Also Read : సెమీస్ కు చేరిన టీమిండియా

Leave A Reply

Your Email Id will not be published!