Sanju Samson : ఏదో ఒక రోజు జాతీయ జట్టులోకి వస్తా – శాంసన్
కేరళ స్టార్ హిట్టర్ షాకింగ్ కామెంట్స్
Sanju Samson : అత్యుత్తమ ఆట తీరుతో లక్షలాది మంది అభిమానులను కలిగి ఉన్న యంగ్ క్రికెటర్ గా పేరొందాడు కేరళకు చెందిన సంజూ శాంసన్. ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్) లో రాజస్థాన్ రాయల్స్ కు నాయకత్వం వహించాడు.
ఎవరూ ఊహించని రీతిలో హేమా హేమీ జట్లకు షాక్ ఇచ్చాడు. ఆపై తన జట్టును ఫైనల్ వరకు తీసుకు వచ్చాడు. ఇందులో కెప్టెన్ గా వంద మార్కులు కొట్టేశాడు.
వ్యక్తిగతంగా రాణించాడు. ఆపై భారత జట్టులోకి వచ్చాడు. సుదీర్ఘ కాలం తర్వాత మళ్లీ పునరాగమనం కలిగినా అది ఒకటి రెండు మ్యాచ్ లకే పరిమితం చేసింది బీసీసీఐ(BCCI).
తాజాగా ఆస్ట్రేలియా వేదికగా జరిగే టి20 వరల్డ్ కప్ కు సంజూ శాంసన్ ను(Sanju Samson) ఎంపిక చేస్తారని అంతా భావించారు. ప్రధానంగా తాజా, మాజీ ఆటగాళ్లు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
కానీ ఊహించని షాక్ ఇచ్చింది బీసీసీఐ. ఎలాంటి పర్ ఫార్మెన్స్ చూపని రిషబ్ పంత్ కు ఛాన్స్ ఇచ్చింది. మెరుగైన స్ట్రైక్ రేట్ కలిగినా ఎంపిక చేయక పోవడంతో ఫ్యాన్స్ , నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ట్విట్టర్ లో ఏకి పారేశారు సెలెక్షన్ కమిటీని. ఈ సందర్భంగా శనివారం స్పందించాడు సంజూ శాంసన్. తనను ఎంపిక చేయక పోవడంపై తాను ఎలాంటి నిరాశకు లోను కాలేదన్నాడు.
ఏదో ఒక రోజు జాతీయ జట్టులోకి వస్తానని స్పష్టం చేశాడు. ఇదిలా ఉండగా భారత్ – ఎ జట్టుకు సంజూ శాంసన్(Sanju Samson) ను కెప్టెన్ గా నియమించింది బీసీసీఐ. కేఎల్ రాహుల్, పంత్ దేశం కోసం ఆడతారని తాను కూడా ఆడాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు.
Also Read : అది పూర్తిగా రెచ్చగొట్టే ప్రకటన – రమీజ్ రజా