Will Smith : తప్పైంది మిత్రమా మన్నించవా ప్లీజ్
మరోసారి సారీ చెప్పిన విల్ స్మిత్
Will Smith : విల్ స్మిత్ ఈ పేరు తెలియని వారంటూ ఉండరు ప్రపంచంలో. మోస్ట్ పాపులర్ హాలీవుడ్ స్టార్. పూర్తిగా భావోద్వేగాలను కంట్రోల్ లో పెట్టుకుని నటించే అతి కొద్ది మంది నటులలో ఒకడు.
కానీ అనుకోకుండా ఇటీవల అమెరికా వేదికగా జరిగిన ఆస్కార్ అవార్డుల ఉత్సవంలో సహ హాస్య నటుడి చెంప ఛెళ్లుమనిపించాడు. విల్ స్మిత్(Will Smith) నుంచి ఊహించని ఈ చర్యకు యావత్ సినీ ప్రపంచం విస్తు పోయింది.
ఎందుకు జరిగిందనే దానిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. కానీ ఆస్కార్ అవార్డుల కమిటీ ఒప్పుకోలేదు. అతడిపై నిషేధం విధించింది.
ఈ సందర్భంగా తన భార్య గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తాను అలా చేయాల్సి వచ్చిందని స్పష్టం చేశాడు విల్ స్మిత్. తాజాగా మరోసారి తన సహచర నటుడికి క్షమాపణలు చెపుతున్నానని పేర్కొన్నాడు.
ఈ మేరకు విల్ స్మిత్ తనకు కోట్లాది మంది అభిమానులు కలిగిన సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ ఇన్ స్టా గ్రామ్ వీడియోలో క్షమాపణలు చెప్పాడు.
ఇందులో తాను క్రిస్ రాక్ ను సంప్రదించానని, కానీ సదరు హాస్య నటుడు తనకు తో ఇంకా మాట్లాడేందుకు సిద్దంగా లేడని ఆవేదన వ్యక్తం చేశాడు.
విల్ స్మిత్ భార్య, నటి అయినా జాడా పింకెట్ స్మిత్ గుండు చేయించుకుని ప్రత్యేకంగా ప్రస్తావించాడు హాస్య నటుడు. దీంతో తట్టుకోలేని విల్ స్మిత్ బరస్ట్ అయ్యాడు.
ఏది ఏమైనా మనిషి ఏ స్థాయిలో ఉన్నా చేసిన తప్పును ఒప్పుకుంటే క్షమించమంటుంది న్యాయస్థానం. ఇకనైనా విల్ స్మిత్(Will Smith) విన్నపాన్ని మన్నిస్తాడని కోరుకుందాం.
Also Read : గ్లోబల్ సింగర్ షకీరాకు బిగ్ షాక్