Team India : సఫారీ టూర్ లో ఉన్న భారత జట్టు పర్యటన ఇక ఆఖరి అంకానికి చేరుకుంది. ఇప్పటికే మూడు టెస్టుల సీరీస్ ను 2-1తో కోల్పోయిన టీమిండియా మూడు వన్డేల సీరీస్ ను సైతం కోల్పోయింది.
ఇంక భారత జట్టు చేతిలో కేవలం ఒకే ఒక్క మ్యాచ్ ఉంది. ఆ మ్యాచ్ ను కూడా సఫారీ టీం ఓడించి క్లీన్ స్విప్ చేయాలని చూస్తోంది.
అయితే ఆ ఒక్క దానిని గెలుపొంది పోయిన పరువును కాపాడు కోవాలని ప్రయత్నాలు చేస్తోంది టీమిండియా(Team India ).
ఈ తరుణంలో ఒక మ్యాచ్ లో కొందరు రాణిస్తే మరో మ్యాచ్ లో ఇంకొందరు రాణించారు.
మొత్తంగా చూస్తే పూర్తి స్థాయిలో భారత జట్టు ఆటగాళ్లు పర్ ఫార్మెన్స్ కనబర్చడం లేదు.
దీనిపై మరింత ఫోకస్ పెట్టే పనిలో ఉన్నాడు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్.
టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ లో రెండు గ్రూపులు ఉన్నాయంటూ సంచలన కామెంట్స్ చేశాడు పాకిస్తాన్ మాజీ ఆటగాడు దానిష్ కనేరియా.
చివరి ఈ ఒక్క మ్యాచ్ లో ఎలాగైనా సరే గెలిచి తీరాలని అనుకుంటోంది.
అత్యంత పేలవమైన నాయకత్వం కూడా భారత జట్టుకు(Team India )శాపంగా మారిందన్న ఆరోపణలు ఉన్నాయి.
ప్రత్యేకించి గవాస్కర్ కేఎల్ రాహుల్ పై ఫైర్ అయ్యారు. చివరి వన్డే కేప్ టౌన్ లోని న్యూలాండ్స్ లో మూడో మ్యాచ్ జరగనుంది.
శిఖర్ ధావన్ 108 పరుగులు చేశాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్ రెండో వన్డేలో రాణించాడు.
ఇక కోహ్లీ ఫస్ట్ వన్డేలో మెరిస్తే రెండో వన్డేలో డకౌట్ అయ్యాడు. శ్రేయస్ అయ్యర్ లేదా రుతురాజ్ గైక్వాడ్ లో ఎవరో ఒకరు ఉండనున్నారు.
రిషబ్ పంత్ దుమ్ము రేపాడు. రెండో వన్డేలో 85 పరుగులు చేశాడు.
సూర్య కుమార్ యాదవ్ సత్తా చాటాల్సి ఉంది. ఇక శార్దూల్ ఠాకూర్ ఫినిషర్ గా పనికొచ్చేలా ఉన్నాడు.
ఫస్ట్ వన్డేలో 50 పరుగులతో రెండో వన్డేలో 42 పరుగులతో నాటౌట్ గా నిలిచి సత్తా చాటాడు.
అశ్విన్, చాహర్, బుమ్రా, ప్రసిద్ద్ కృష్ణ, యుజువేంద్ర చాహల్ ను ఆడిస్తారో చూడాలి.
Also Read : ఓవర్ కాన్ఫిడెన్సే ఓటమికి కారణం