Prashant Kishor : గాంధీ..పీకే మ‌ధ్య బంధం బ‌లప‌డేనా

కొన‌సాగుతున్న చ‌ర్చ‌ల ప‌రంప‌ర

Prashant Kishor : దేశంలోని ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల త‌ర్వాత కాంగ్రెస్ (Congress) పార్టీకి కోలుకోలేని షాక్ త‌గిలింది. దీంతో మ‌రోసారి రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ (Prashant Kishor) తో గాంధీ ఫ్యామిలీ భేటీ అయిన‌ట్లు జోరుగా ప్ర‌చారం చోటు చేసుకుంది.

ఈ త‌రుణంలో రాబోయే 2024లో జ‌రిగే సార్వ‌త్రిక ఎన్నిక‌లలో ఎలాగైనా స‌త్తా చాటాల‌ని కాంగ్రెస్ పార్టీ (Congress) అనుకుంటోంది. పీకే (PK) ఇప్ప‌టికే ప‌లుమార్లు భేటీ అయ్యారు. కానీ చ‌ర్చ‌లు అసమంజ‌సంగా ముగిశాయి.

తాజాగా మ‌రోసారి రాహుల్ గాంధీ (Rahul Gandhi) తో ప్ర‌శాంత్ కిషోర్(Prashant Kishor) స‌మావేశమైన‌ట్లు తెలిసింది. త‌దుప‌రి నాలుగు వారాల్లో క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ ఏడాది చివ‌ర్లో జ‌రిగే గుజ‌రాత్ ఎన్నిక‌ల‌పై ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టాల‌ని సూచించిన‌ట్లు స‌మాచారం.

కాంగ్రెస్ (Congress) నాయ‌క‌త్వం, ప్ర‌శాంత్ కిషోర్ (Prashant Kishor) , రాబోయే ఎన్నిక‌ల్లో పార్టీని విజ‌య ప‌థంలో ఎలా న‌డిపించాల‌నే దానిపై చ‌ర్చించిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

2024 బ్లూ ప్రింట్ త‌యారు చేసే ప‌నిలో పీకే (PK) ప‌డిన‌ట్లు టాక్. ఇరు పక్షాలు గుజ‌రాత్ వ‌ర‌కే ప‌ని చేయాల‌ని, ఆ త‌ర్వాత వ‌చ్చే రిజ‌ల్ట్ ను బ‌ట్టి ముందుకు సాగ‌డమా లేదా అన్న‌ది స్ప‌ష్టం అవుతుంద‌ని పేర్కొన్న‌ట్లు టాక్.

ఇప్ప‌టికే కాంగ్రెస్ (Congress) లో రెండు వ‌ర్గాలుగా విడి పోయారు. ఒక వ‌ర్గం గాంధీ ఫ్యామిలీని స‌మ‌ర్థిస్తుంటే మ‌రో వ‌ర్గం వ్య‌తిరేకిస్తూ వ‌స్తోంది. కొత్త వారికి నాయ‌క‌త్వం ఇవ్వాల‌నే డిమాండ్ కొన‌సాగుతోంది.

ఇప్ప‌టి వ‌ర‌కు గ‌త ఎన్నిక‌ల్లో ప‌శ్చిమ బెంగాల్ , త‌మిళ‌నాడులో ప‌ని చేశారు ప్ర‌శాంత్ కిషోర్(Prashant Kishor) . తాజాగా తెలంగాణ‌లో టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్న‌ట్లు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌క‌టించ‌డం విశేషం.

కాంగ్రెస్ (Congress) పార్టీలో కీల‌క పోస్ట్ ఇస్తారా లేక బ‌య‌టి నుంచి పార్టీకి పీకే స‌పోర్ట్ చేస్తారా అన్న‌ది వేచి చూడాల్సి ఉంది.

Also Read : అరుదైన దృశ్యం మోదీ సంతోషం

Leave A Reply

Your Email Id will not be published!