Kapil Dev : రెజ్లర్లకు న్యాయం జరుగుతుందా – కపిల్
మాజీ భారత క్రికెట్ జట్టు కెప్టెన్
Kapil Dev : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ నిఖంజ్ (Kapil Dev ) నిప్పులు చెరిగారు. ఆయన తన ఇన్ స్టా గ్రామ్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర సర్కార్ అనుసరిస్తున్న తీరుపై మండిపడ్డారు. అంతే కాదు ఇంకా ఎన్నాళ్లకు మహిళా మల్ల యోధులకు న్యాయం జరుగుతుందంటూ ప్రశ్నించారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ ,మాజీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై సంచలన ఆరోపణలు చేశారు మహిళా రెజ్లర్లు. ఆయన నుంచి తమకు ప్రాణ హాని ఉందన్నారు.
ఆపై ప్రతినిత్యం శారీరకంగా, మానసికంగా లైంగికంగా వేధింపులకు పాల్పడుతున్నారంటూ ఆరోపించారు. అంతే కాదు ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేయలేదంటూ కోర్టుకు ఎక్కారు. చివరకు సుప్రీంకోర్టు దెబ్బకు కేసు నమోదు చేశారు. ఇందులో రెండు కేసులు ఉన్నాయి బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై.
గత ఏడు రోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మహిళా రెజ్లర్లు ఆందోళన చేపట్టారు. ఇప్పటి వరకు కేంద్రం కిమ్మనడం లేదు. పైగా పీటీ ఉష తీవ్ర విమర్శలు చేశారు మహిళా రెజ్లర్లపై. దేశ పరువును బజారు కీడుస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై తీవ్రంగా తప్పు పట్టారు కపిల్ దేవ్. ఎన్ని ఇబ్బందులు పడితే మహిళా రెజ్లర్లు రోడ్డు పైకి వస్తారంటూ నిలదీశారు కపిల్ దేవ్ నిఖంజ్. ఈ మేరకు వినేష్ ఫోగట్ , సాక్షి మాలిక్, బజరంగ్ పునియా ఫోటోను షేర్ చేశారు.
Also Read : రెజ్లర్ల రోదన నీరజ్ చోప్రా ఆవేదన