WIW vs ENGW WC : ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ – ఐసీసీ ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ -2022 (WIW vs ENGW WC)లో అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. ఇంగ్లండ్ పై జరిగిన ఉత్కంఠ పోరులో విక్టరీ సాధించింది.
కేవలం 7 పరుగుల తేడాతో గెలుపొందింది. ఆఖరి వరకు టెన్షన్ కు గురి చేసిన ఈ మ్యాచ్ ఆసక్తిని రేపింది. ఇదిలా ఉండగా టోర్నీలో భాగంగా జరిగిన మ్యాచ్ లో మొదట టాస్ గెలిచింది వెస్టిండీస్ ఉమెన్ జట్టు.
కెప్టెన్ మొదటగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఓపెనర్లు డాటిన్ 31 పరుగులు చేస్తే హేలే మాథ్యూస్ 45 పరుగులు చేసి సత్తా చాటింది.
ఆ తర్వాత వెంట వెంటనే విండీస్ వికెట్లను కోల్పోయింది. ఈ సమయంలో ఇంగ్లండ్ బౌలర్లు తీవ్ర ఒత్తిడి పెంచారు విండీస్ ప్లేయర్లపై. తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న విండీస్ జట్టును గట్టెక్కించింది వికెట్ కీపర్ గా ఉన్న బ్యాటర్ కాంపె బెల్ .
ఏకంగా 80 బంతులు ఎదుర్కొని 66 పరుగులు చేసింది. ఇంకో ప్లేయర్ నేషన్ 49 పరుగులు చేసి సత్తా చాటింది. దీంతో వెస్టిండీస్ టీమ్ భారీ టార్గెట్ ప్రత్యర్థి జట్టు ఇంగ్లండ్ పై .
నిర్ణీత 50 ఓవర్లలో వెస్టిండీస్ ఆరు వికెట్లు కోల్పోయి 225 పరుగులు చేసింది. ఈ తరుణంలో టార్గెట్ ఛేదనకు దిగిన ఇంగ్లండ్ చివరి దాకా పోరాడింది విండీస్ తో.
ఓపెనర్ లారెన్ 12 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టింది. ఇంకో ఓపెనర్ టామీ 46 రన్స్ చేసింది. మిగతా ప్లేయర్లు అలా వచ్చి ఇలా వెళ్లి పోయారు.
చివర్లో సోఫీ, కోట్ క్రాస్ విండీస్ బౌలర్లపై విరుచుకు పడ్డారు. ఆఖరి సమయంలో బౌలర్లు సత్తా చాటడంతో 218 పరుగులకే ఆలౌట్ అయ్యారు.
Also Read : పాకిస్తాన్ పై ఆస్ట్రేలియా గ్రాండ్ విక్టరీ