Draupadi Murmu : సంస్కారం లేక పోతే సర్వ నాశనం
ఎన్ని కోట్లున్నా తినేది అన్నం..చపాతీలు
Draupadi Murmu : దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్ని కోట్లు ఉన్నా ఏం లాభమని, ఎవరైనా తినేది కాస్తంత అన్నం, రెండు లేదా మూడు చపాతీలే కదా అని అన్నారు. తెలంగాణ పర్యటనలో భాగంగా మంగళవారం హైదరాబాద్ లోని కేశవ్ మెమోరియల్ కళాశాల విద్యార్థులతో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.
జీవితంలో ఎవరైనా ఎదగాలంటే ముందు సంస్కారం అన్నది అవసరమన్నారు. ఒక స్థాయికి ఎదిగిన తర్వాత డబ్బులు వాటంతట అవే వస్తాయన్నారు ద్రౌపది ముర్ము(Draupadi Murmu). కుటుంబం సమాజంపై పెను ప్రభావం చూపుతుందన్నారు. దేశ అభివృద్దిలో పురుషులతో పాటు మహిళలు కూడా కీలకమైన పాత్ర పోషిస్తున్నారని అన్నారు. ప్రత్యేకించి మహిళల పట్ల వివక్ష ఇంకా కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు ద్రౌపది ముర్ము.
మహిళలు, పురుషులు అంతా సమానమేనని పేర్కొన్నారు. చిన్నారులు, విద్యార్థులకు చిన్నప్పటి నుంచే సంస్కారం, సంస్కృతి, నాగరికత నేర్పించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
మనిషి ఎదుగుదల పూర్తిగా బాల్యం మీద ఆధారడి ఉంటుందన్నారు. విలువలను బోధించే ఇతిహాసాలను చదివే అలవాటు నేర్పించాలని అన్నారు ద్రౌపది ముర్ము. ఎన్ని కోట్లున్నా వేస్ట్ అని ఆత్మ సంతృప్తి అనేది ముఖ్యమన్నారు. మన మూలాలను మర్చి పోవద్దని విద్యార్థులకు సూచించారు.
గతంలో చదువుకునేందుకు అవకాశాలు ఉండేవి కావన్నారు. ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చానని చెప్పారు. కానీ ఇప్పుడు ఊహంచని విధంగా అపారమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. చదువుకునేందుకు వీలు కుదురుతోందన్నారు. టెక్నాలజీ మారినా విలువలు మారవని గుర్తించాలన్నారు ద్రౌపది ముర్ము(Draupadi Murmu).
Also Read : పుస్తకాల్లో చదివాం ఇప్పుడు చూస్తున్నాం