Wrestlers Deadline : కేంద్రానికి మ‌హిళా రెజ్ల‌ర్ల డెడ్ లైన్

న‌రేష్ టికాయ‌త్ కు పత‌కాలు

Wrestlers Deadline : తాము సాధించిన ప‌త‌కాల‌ను హ‌రిద్వార్ లో నిమ‌జ్జ‌నం చేసేందుకు ప్ర‌య‌త్నం చేసిన మ‌హిళా రెజ్ల‌ర్లను(Wrestlers) శాంతింప చేశారు సంయుక్త కిసాన్ మోర్చా రైతు అగ్ర నేత న‌రేష్ టికాయ‌త్. అర్ధ‌రాత్రి అంతా హై డ్రామా చోటు చేసుకుంది గంగా న‌ది తీరం వ‌ద్ద‌. వేలాది మంది మ‌హిళా రెజ్ల‌ర్ల‌కు మ‌ద్ద‌తుగా నిలిచారు. హుటా హుటిన విష‌యం తెలుసుకున్న న‌రేష్ టికాయ‌త్ మ‌హిళా రెజ్ల‌ర్ల వ‌ద్ద‌కు చేరుకున్నారు. వారితో సంభాషించారు. తాము అండ‌గా ఉంటామ‌ని ప్ర‌క‌టించారు.

ద‌య‌చేసి ప‌త‌కాలు అనేవి మోదీనో లేక భార‌తీయ జ‌న‌తా పార్టీనో ఇచ్చిన‌వి కావ‌ని పేర్కొన్నారు. ప‌త‌కాల‌ను నిమ‌జ్జ‌నం చేయ‌డం అంటే భార‌తీయులను ఇబ్బంది పెట్టిన‌ట్లు అవుతుంద‌ని తెలిపారు. ద‌య‌చేసి అర్థం చేసుకోవాల‌ని, త‌మ‌తో స‌హ‌క‌రించాల‌ని యావ‌త్ భార‌త దేశంలోని రైతులంతా మీవెంటే ఉంటార‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు న‌రేష్ తికాయ‌త్. దీంతో సుదీర్ఘ చ‌ర్చ‌ల అనంత‌రం మ‌హిళా రెజ్ల‌ర్లు తాము సాధించిన ప‌త‌కాల‌ను గంగ‌లో నిమ‌జ్జ‌నం చేయ‌కుండా ఉండేందుకు అంగీక‌రించారు.

ఈ సంద‌ర్భంగా కేంద్ర ప్ర‌భుత్వానికి ఐదు రోజుల గ‌డువు(Deadline) ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు న‌రేష్ టికాయ‌త్. ఒకే ఒక్క వ్య‌క్తిని ఎందుకు ర‌క్షిస్తున్నారో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. రైతుల‌తో పెట్టుకున్న ఏ స‌ర్కార్ ఇంత వ‌ర‌కు బ‌తికి బ‌ట్ట‌క‌ట్టిన దాఖలాలు లేవ‌న్నారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు న‌రేష్ టికాయ‌త్.

భార‌త రెజ్ల‌ర్ల స‌మాఖ్య చీఫ్ ను ఎందుకు తొల‌గించ‌డం లేదో చెప్పాల‌న్నారు. తాము ప్ర‌త్య‌క్ష కార్యాచ‌ర‌ణ‌కు దిగుతామ‌ని హెచ్చరించారు. ప‌త‌కాలు సాధించిన మ‌హిళ‌లు త‌మ బిడ్డ‌లేన‌ని ఆ విష‌యం గుర్తిస్తే మంచింద‌ని హిత‌వు ప‌లికారు న‌రేష్ టికాయ‌త్.

Also Read : Naresh Tikait

Leave A Reply

Your Email Id will not be published!