Vijender Singh Joins : బాక్స‌ర్ విజేంద‌ర్ సింగ్ కు నో ఛాన్స్

వేదిక‌పై వ‌ద్ద‌ని కోరిన మ‌హిళా రెజ్లర్లు

Vijender Singh Joins : ప్ర‌ముఖ భార‌తీయ బాక్స‌ర్ , కాంగ్రెస్ నాయ‌కుడు విజేంద‌ర్ సింగ్ కు చేదు అనుభ‌వం చోటు చేసుకుంది. భారత రెజ్లింగ్ స‌మాఖ్య అధ్య‌క్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూష‌ణ్ శ‌ర‌ణ్ సింగ్ ను తొల‌గించాల‌ని, వెంట‌నే అరెస్ట్ చేయాల‌ని కోరుతూ మ‌హిళా రెజ్ల‌ర్లు గ‌త రెండు రోజులుగా ఢిల్లీలో ఆందోళ‌న చేప‌ట్టారు.

జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద చేప‌ట్టిన నిర‌స‌న దీక్ష శుక్ర‌వారం నాటితో మూడు రోజుల‌కు చేరుకుంది. కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తో జ‌రిపిన చ‌ర్చ‌లు విఫ‌ల‌మ‌య్యాయి. డ‌బ్ల్యుఎఫ్ఐ నుంచి వివ‌ర‌ణ ఇవ్వాల‌ని కోరుతూ 72 గంట‌ల స‌మ‌యం విధించింది. ఇదే స‌మ‌యంలో ఢిల్లీ మ‌హిళా క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్ స్వాతి మ‌లివాల్ సీరియ‌స్ అయ్యారు. చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ బ్రిజ్ భూష‌ణ్ శ‌ర‌ణ్ కు, స్పోర్ట్స్ కార్య‌ద‌ర్శితో పాటు కోచ్ లకు కూడా నోటీసులు జారీ చేశారు.

ప్ర‌స్తుతం మ‌హిళా రెజ్ల‌ర్ల నిర‌స‌న దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారి తీసింది. ఈ త‌రుణంలో ప్ర‌ముఖ బాక్స‌ర్ , కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు విజేంద‌ర్ సింగ్ ఇవాళ మ‌హిళా రెజ్ల‌ర్ల‌కు మ‌ద్ద‌తు(Vijender Singh Joins)  తెలిపారు. వేదిక‌పైకి వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నించారు. మ‌హిళా రెజ్లెర్లు తీవ్ర అభ్యంత‌రం తెలిపారు. స‌పోర్ట్ ఇచ్చినందుకు ధ‌న్య‌వాదాలు తెలిపారు.

కానీ నిర‌స‌న‌కారుల మ‌ధ్య కూర్చోవాల‌ని స్ప‌ష్టం చేశారు. దీంతో ఆయ‌న వేదిక పైన కాకుండా కింద సామాన్య ప్రేక్ష‌కుల మ‌ధ్య కూర్చున్నారు. మ‌రో వైపు డ‌బ్ల్యూఎఫ్ఐ చీఫ్ ను వెంట‌నే అరెస్ట్ చేయాల‌ని, ప‌ద‌వి నుంచి తొల‌గించాల‌ని డిమాండ్ చేశారు విజేంద‌ర్ సింగ్.

Also Read : డ‌బ్ల్యూఎఫ్ఐ చీఫ్ ను తొల‌గించండి

Leave A Reply

Your Email Id will not be published!