Anurag Thakur : రెజ్లర్ల సమస్య సున్నితమైంది
నోరు విప్పిన మంత్రి ఠాకూర్
Anurag Thakur : ఎట్టకేలకు నోరు విప్పారు క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్(Anurag Thakur). డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ , బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై సంచలన ఆరోపణలు చేశారు మహిళా రెజ్లర్లు. ఆయనకు నార్కో టెస్ట్ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ తరుణంలో గురువారం రైతు నేతలతో కార్యాచరణకు ప్లాన్ చేశారు. దీనిపై తీవ్రంగా స్పందించారు మంత్రి ఠాకూర్. మహిళా రెజ్లర్ల సమస్య సున్నితమైనదని , కేంద్రం త్వరలోనే పరిష్కరిస్తుందని చెప్పారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. రెజ్లర్లను మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించాలని సుప్రీంకోర్టు కోరిందని తెలిపారు.
ముంబై పర్యటనలో ఉన్న అనురాగ్ ఠాకూర్ కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. తమ ఆరోపణలపై విచారణకు కమిటీ వేయాలని మహిళా రెజ్లర్లు కోరారని, అందుకు కేంద్రం అంగీకరించిందని చెప్పారు. అయితే దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. కమిటీ నివేదిక రాకుండానే ఆరోపణలు చేస్తే ఎలా అని ప్రశ్నించారు అనురాగ్ ఠాకూర్.
ఇదిలా ఉండగా తమకు ఆత్మ గౌరవం ముఖ్యమని స్పష్టం చేశారు రెజ్లర్లు. చివరకు సంచలన నిర్ణయం తీసుకున్నారు. హరిద్వార్ లోని గంగలో తాము సాధించిన పతకాలను నిమజ్జనం చేస్తామని ప్రకటించారు. దీనిని విరమింప చేశారు సంయుక్త కిసాన్ మోర్చా అగ్ర నేతలు రాకేశ్ టికాయత్, నరేష్ టికాయత్. వారికి పూర్తిగా అండగా ఉంటామని ప్రకటించారు. మరో రైతు ఉద్యమం లాగా మారుస్తామని హెచ్చరించారు. కేంద్రానికి 5 రోజుల గడువు విధించారు.
Also Read : Varun Tej Lavanya Tripathi