Brinda Karat Leave : బృందా కారత్ కు చేదు అనుభవం
ఇది రాజకీయ వేదిక కాదన్న రెజ్లర్లు
Brinda Karat Leave : సీపీఎం నాయకురాలు బృందా కారత్ కు చేదు అనుభవం మిగిలింది. డబ్ల్యూఎఫ్ఐ చీఫ్, భారతీయ జనతా పార్టీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ మహిళా రెజ్లర్లు ఆందోళన చేపట్టారు. గురువారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టిన రెజ్లర్లకు సంఘీభావం ప్రకటించేందుకు వెళ్లారు బృందా కారత్(Brinda Karat Leave).
అయితే రెజ్లర్లు పూనియా అభ్యంతరం తెలిపారు. ఇది రాజకీయ పార్టీలకు వేదిక కాదని, ఇది తమ స్వంత సమస్య అని స్పష్టం చేశారు. దీంతో బృందా కారత్ వారిని నచ్చ చెప్పేందుకు ప్రయత్నం చేశారు. కానీ రెజ్లర్లు వినిపించు కోలేదు. ఇదే సమయంలో ఇప్పటికే ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్ స్పందించారు.
ఆమె విషయం తెలిసిన వెంటనే హుటా హుటిన రెజ్లర్లు ఆందోళన చేపట్టిన జంతర్ మంతర్ వద్దకు వచ్చారు. వారితో మాట్లాడారు. ఈ మేరకు 12 మందికి పైగా మహిళలు లైంగిక వేధింపులకు గురయ్యారని ఆరోపించారని తెలిపారు. డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ తో పాటు కోచ్ లు, కార్యదర్శికి నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు.
ఇదిలా ఉండగా ప్రస్తుతం 72 గంటల లోపు వివరణ ఇవ్వాలని కేంద్ర సర్కార్ రెజ్లింగ్ సంఘాన్ని ఆదేశించింది. మరో వైపు బీజేపీ నాయకురాలు బబితా ఫోగట్ అక్కడికి చేరుకుని వారికి సంఘీభావం తెలిపారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఈ విషయంపై స్పందించారు.
వెంటనే ఎంపీని సస్పెండ్ చేయాలని, విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా తాను ఎలాంటి వేధింపులకు పాల్పడలేదని బ్రిజ్ భూషణ్ సింగ్ తెలిపారు.
Also Read : డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ తీరు సిగ్గుచేటు – స్వాతి మలివాల్