Womens IPL Rights : మహిళా ఐపీఎల్ కు కాసుల పంట
స్వంతం చేసుకున్న రిలయన్స్
Womens IPL Rights : భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)కి కాసుల పంట పండింది. ఇప్పటికే వేల కోట్ల రూపాయలు టెలికాస్ట్ రూపేణా భారీగా సమకూరింది ఖజానాకు. వచ్చే మార్చి నెలలో ఇండియన్ ఉమెన్స్ ఐపీఎల్(Womens IPL Rights) నిర్వహించనుంది బీసీసీఐ. ఇప్పటికే బిడ్డింగ్ కూడా చేపట్టింది. తాజాగా మహిళల ఐపీఎల్ ప్రసార హక్కులు ఊహించని ధరకు అమ్ముడు పోయాయి.
ఉమెన్స్ ఐపీఎల్ మీడియా హక్కుల కోసం నిర్వహించిన బిడ్డింగ్ లో దిగ్గజ కంపెనీలు పాల్గొన్నాయి. వీటిలో స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ , అమెజాన్ ప్రైమ్ , రిలయన్స్ వయా కామ్ 18, ప్ఆయన్ కోడ్ , టైమ్స్ ఇంటర్నెట్ , గూగుల్ , డిస్కవరీ వంటి బడా కంపెనీలు పోటీ పడ్డాయి.
చివరకు రూ. 951 కోట్లకు ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ వయా కామ్ 18 ఉమెన్స్ ఐపీఎల్ మీడియా హక్కులను స్వంతం చేసుకుంది. టెలికాస్ట్ కు సంబంధించి 2023-2027 వరకు ఈ హక్కుల బాధ్యతలు రిలయన్స్ టెలికాస్ట్ చేస్తుంది. ఇందులో భాగంగా ఒక్కో మహిళలు ఆడే ఐపీఎల్ మ్యాచ్ కు రూ. 7.09 కోట్లు బీసీసీఐకి చెల్లించనుంది.
ఐపీఎల్ టీవీ ప్రసార హక్కులతో పాటు డిజిటల్ టెలికాస్ట్ హక్కులను కూడా వయా కామ్ 18 స్వంతం చేసుకుంది. మరో వైపు మెన్స్ ఐపీఎల్ 2023-27 సీజన్ దాకా వచ్చే మీడియా హక్కుల వేలం ద్వారా బీసీసీఐకి రూ. 48,390 కోట్లు సమకూరనున్నాయి. ఇక మహిళల ఐపీఎల్ లో ఫ్రాంచైజీలు ఫోకస్ పెట్టాయి.
చెన్నై సూపర్ కింగ్స్ , రాజస్థాన్ రాయల్స్ , ముంబై ఇండియన్స్ , పంజాబ్ కింగ్స్ , ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ పడుతున్నాయి. ఇంకా ఏ జట్టు ఎవరిని కొనుగోలు చేస్తుందనేది ఈనెల 25న బీసీసీఐ ప్రకటించనుంది.
Also Read : సచిన్ రికార్డ్ బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ