Womens T20 : ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న మహిళల ఛాలెంజర్స్ టీ20 టోర్నీని ఖరారు చేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి ( బీసీసీఐ). ఇప్పటికే షెడ్యూల్ ను ఖరారు చేసి లక్నో వేదికను ఖరారు చేసింది.
అయితే లక్నో కాకుండా పుణెకు మార్చుతున్నట్లు బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ ప్రకటించారు. ఈనెల 23 నుంచి 28 దాకా మహిళల టీ20 టోర్నీ జరుగుతుంది.
ఈ టోర్నీలో మూడు జట్లు పాల్గొంటాయి. ఒక జట్టుకు స్మృతి మంధాన నాయకత్వం వహిస్తుండగా మిగతా జట్లకు హర్మన్ ప్రీత్ కౌర్ , హైదరాబాద్ స్టార్ ప్లేయర్ మిథాలీ రాజ్ కెప్టెన్ గా ఉన్నారు.
ఈ మూడు జట్ల మధ్య ఈ టోర్నీ టైటిల్ కోసం తల పడనున్నాయి. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఇండియన్ ప్రిమియర్ లీగ్ 2022 ఈనెల 29న అహ్మదాబాద్ లోని మోదీ స్టేడియంలో జరుగుతుంది.
ఇక మహిళలకు సంబంధించిన టీ20(Womens T20) టోర్నీ కి సంబంధంచిన అన్ని మ్యాచ్ లు లక్నోలో కాకుండా పుణె లోనే జరుగుతాయని స్పష్టం చేసింది బీసీసీఐ.మూడు రౌండ్ రాబిన్ గేమ్ పద్దతిన కొనసాగుతాయి మ్యాచ్ లు. 28న ఫైనల్ మ్యాచ్ నిర్వహిస్తారు.
మహిళల టీ20 ఛాలెంజ్ 2018లో ట్రైల్ బ్లేజర్స్ , ఐపీఎల్ సూపర్ నోవాస్ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. 2019లో మూడు జట్లకు విస్తరించింది.
మహిళా జట్టు ఆసిస్ టూర్ సందర్భంగా టోర్నీ నిర్వహించ లేదు. 2023లో మహిళల ఐపీఎల్ నిర్వహంచేందుకు పట్టుదలతో ఉన్నాడు బీసీసీఐ చీఫ్ దాదా.
Also Read : ‘తమిళ తంబి’ జోర్దార్ ఇన్నింగ్స్