T20 World Cup Schedule : మహిళల వరల్డ్ కప్ షెడ్యూల్
సౌతాఫ్రికా వేదికగా 8వ ఎడిషన్
T20 World Cup Schedule : ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆధ్వర్యంలో టీ20 మహిళల ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. ఈనెల 10 నుంచి మ్యాచ్ లు మొదలవుతాయి. ఫిబ్రవరి 26న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. రిజర్వ్ డే 27న నిర్ణయించింది ఐసీసీ. ఈసారి దక్షిణాఫ్రికా ఆతిథ్యం ఇవ్వనుంది. కేప్ టౌన్ , పార్ల్ , గ్కే బెర్హా టోర్నీ కోసం ఆతిథ్యం ఇవ్వనున్నాయి. నాకౌట్ మ్యాచ్ లు కేప్ టౌన్ లో జరుగుతాయి.
ఇక ఐసీసీ వరల్డ్ కప్ 2023కి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఐపీఎల్ మహిళలకు సంబంధించిన ఫస్ట్ ఐపీఎల్ కు కూడా భారత్ లో జరగనుంది. ఇప్పటికే వేలం పాట పూర్తయింది. ఇక మహిళల టీ20 వరల్డ్ కప్ విషయానికి వస్తే మొత్తం 10 జట్లు ఆడుతాయి. రెండు గ్రూపులుగా విభజించింది ఐసీసీ. ఫిబ్రవరి 21 వరకు షెడ్యూల్ చేయబడిన గ్రూప్ గేమ్ ల సమయంలో ప్రతి జట్టు తమ గ్రూప్ లోని ఇతర నాలుగు జట్లతో ఒకసారి ఆడుతుంది.
గ్రూప్ దశ ముగిసే సమయానికి ప్రతి గ్రూప్ నుండి మొదటి ఎండు జట్లు సెమీ ఫైనల్ కు చేరుకుంటాయి. ఇక మహిళల టీ20 వరల్డ్ కప్ లో గ్రూప్ – ఎ – లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ , దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు ఆడతాయి. ఇక గ్రూప్ బి -లో పాకిస్తాన్ , ఐర్లాండ్ , వెస్టిండీస్ , ఇంగ్లాండ్ , భారత్ ఆడతాయి. షెడ్యూల్ ప్రకారం చూస్తే ఫిబ్రవరి 10న దక్షిణాఫ్రికా శ్రీలంక మధ్య , 11, విండీస్ , ఇంగ్లండ్ మధ్య జరుగుతుంది.
ఆసిస్ న్యూజిలాండ్ జట్ల మధ్య , 12న భారత్ , పాకిస్తాన్ జట్ల మధ్య , బంగ్లాదేశ్ శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్ కొనసాగుతుంది. 13న విండీస్ ఇండియా మధ్య, ఇంగ్లండ్ ఐర్లాండ్ మధ్య , 14న ఆస్ట్రేలియా బంగ్లాదేశ్ మధ్య, 15న విండీస్ ఇండియా మధ్య, పాకిస్తాన్ ఐర్లాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. 16న శ్రీలంక ఆస్ట్రేలియా మధ్య, 17న న్యూజిలాండ్ బంగ్లాదేశ్ మధ్య, విండీస్ ఐర్లాండ్ జట్ల మధ్య , 18న ఇంగ్లండ్ ఇండియా , దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియా మధ్య కొనసాగుతుంది(T20 World Cup Schedule).
19న పాకిస్తాన్ విండీస్ , న్యూజిలాండ్ శ్రీలంక మధ్య మ్యాచ్ కొనసాగుతుంది. 20న ఐర్లాండ్ ఇండియా , 21న ఇంగ్లాండ్ పాకిస్తాన్ , దక్షిణాఫ్రికా బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతుంది. 23న మొదటి సెమీ ఫైనల్ న్యూలాండ్స్ , కేప్ టౌన్ లో జరుగుతుంది. ఇందుకు 24న రిజర్వ్ డే గా ప్రకటించింది. ఒకవేళ వర్షం వస్తే తిరిగి ప్రారంభిస్తారు. 24న రెండో సెమీ ఫైనల్ కేప్ టౌన్ లోనే కొనసాగుతుంది. 25న రిజర్వ్ డే. 26న ఫైనల్ మ్యాచ్ కొనసాగుతుంది. న్యూలాండ్స్ వేదికగా కేప్ టౌన్ లో. 27న రిజర్వ్ డే.
Also Read : కప్ పై సఫారీ ఫోకస్